హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్-II సమగ్ర ప్రణాళికను రూపొందించి డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ మెట్రో ఫేజ్-II, మెట్రో ఫేజ్-IIIపై కేంద్ర మంత్రితో చర్చించారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్ధం మెట్రోను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II, ఫేజ్-III విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్-Iను L&TMRHLను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం వివరించారు. ప్రస్తుతం ఫేజ్-I ప్రభుత్వం పరిధిలో ఉండడంతో ఫేజ్-II, ఫేజ్-III విస్తరణ సులువవుతుందన్నారు.
హైదరాబాద్‌లో మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-IIలో ఏడు కారిడార్లతో మొత్తం 122.9 కి.మీ మేర విస్తరణకు, రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని సీఎం తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II ప్రాజెక్ట్ ను భారత ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్-IIIగా చేపట్టాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-III కిసంబంధించిన డీపీఆర్ ను ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్.వి.ఎస్.రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-revanth-request-to-khattar-36-219095.html
అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్‌ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది.
తమ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సుమారు రూ.1.5 కోట్ల నగదు, పలు స్థలాలకు సంబంధించిన పత్రాలను కోడలు బంధువులు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నించగా ఓ రౌడీషీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడుల సమయంలో ఆయన నివాసంలో సుమారు 60 లక్షల రూపాయల నగదు లభించగా.. బ్యాంక్ ఖాతాల్లో మరో కోటి అరవై లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.ఇక బంగారం విషయానికి వస్తే దాదాపు రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లు.. అలాగే పెద్ద మొత్తంలో బంగారు ఆభర ణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కిలోల కొద్దీ వెండి వస్తువులు కూడా దొరికినట్లు సమాచారం.
ఇటీవల లూసియానా రాష్ట్రంలోని ఓ సరస్సులో జరిగిన ప్రమాదంలో తన స్నేహి తులు చిక్కుకున్న సమయంలో వారిని కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దిగిన అనురూప్ రెడ్డి, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పలువురు హృద యాలను కదిలించివేసింది
నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పారు. మంత్రి లోకేష్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు.
శరీర భాగాలైన తల, కాళ్లు, చేతులు లేకపోవడంతో తొలుత ఎటువంటి ఆధారాలు లభించ లేదు. అయితే మృతదేహం పై ఉన్న దుస్తులు కీలక క్లూగా మారాయి. ఆ దుస్తులు ఒక ప్రముఖ బ్రాండెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించిన పోలీసులు..దర్యాప్తులో భాగంగా ఆ దుస్తుల బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా.. అవి ఎక్కడ కొనుగోలు చేయబడ్డాయో గుర్తించారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన గ్యాస్ సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుండి 4 కి తగ్గిస్తూ కోత విధించింది. అసలు కారణం, సామాన్యులపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రముఖ వ్యాపారి నివాసం ఉంటున్నారు. ఇంట్లో నేపాలీ దంపతులను పనిలోకి పెట్టుకున్నారు. నెల రోజుల క్రితమే ఈ నేపాల్ దంపతులను వ్యాపారి ఇంటి పనుల కోసం నియమించుకున్నారు కొద్దిరోజుల క్రితం వ్యాపారి తన కుటుంబ సభ్యుల తో కలిసి ముంబై కి వెళ్లి తిరిగి, ఇంటికి వచ్చిన సమయంలో నేపాలి దంప తులు ఇంట్లో కనిపించలేదు.
కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా క్రూ సభ్యులు ఒక్కసారిగా కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై విమా నాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సుమారు 20,000 మంది అభ్యర్థుల హైరింగ్ పరీక్షలను అకస్మాత్తుగా రద్దు చేసింది. ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌లో జరిగిన అక్రమాలే దీనికి కారణమా? ఫ్రెషర్ల ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలు సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక సడలింపులు ఇచ్చింది. బడ్జెట్ 2026 పరిమితుల కంటే మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐదేళ్లలో 690% మరియు పదేళ్లలో 1040% భారీ లాభాలను అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ గ్యాబ్రియేల్ ఇండియా (Gabriel India) పై మోతీలాల్ ఓస్వాల్ సానుకూల రేటింగ్ ఇచ్చింది. మరో 30% లాభాల అంచనాతో రూ. 1266 టార్గెట్ ధరను ప్రకటించింది. ఈ స్టాక్ పూర్తి వివరాలు, ఆర్థిక బలం మరియు భవిష్యత్తు వృద్ధి అంచనాలను ఇక్కడ చూడండి.
ఆర్‌బీఐ సరికొత్త డాలర్-రూపాయి స్వాప్ ఫెసిలిటీ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ పరుగులు పెడుతోంది. SBI, ICICI, IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లలో భారీ లాభాలు రావడానికి గల అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.