పరుగుల వైభవం సూర్యవంశి

Publish Date:Apr 11, 2026

Advertisement

ఐపీఎల్ 2026లో భాగంగా గువహటి వేదికగా  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరుగుల వైభవం ముచ్చట గొలిపింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో విరుచుకుపడిన ఈ బుల్లోడు..   బెంగళూరు బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. హుజిల్ వుడ్ వంటి అనుభవజ్ణులైన బౌలర్లను కూడా లెక్క చేయకుండా సిక్సర్ల మోత మోగించాడు. 

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో  తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20  ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. రజత్ పాటిదార్ 63 పరుగులు, కృనాల్ పాండ్యా  43 నాటౌట్ రాణించడంతో బెంగళూరు 200 పరుగుల మార్క్ దాటింది.  202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వైభవ్   ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సరు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశి  కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అనుభవజ్ఞులైన జోష్ హేజిల్‌వుడ్ వంటి బౌలర్లను సైతం లెక్క చేయకుండా సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ వైభవం స్టేడియాన్ని హోరెత్తించింది. ఆర్సీబీ అభిమానులు సైతం ఈ కుర్రాడి జోరును సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు.   వైభవ్ విధ్వంసం కారణంగా రాజస్థాన్ రాయల్స్ లక్ష్యాన్ని  18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.  

గతంలోనే అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన వైభవ్, ఇప్పుడు ఐపీఎల్ వేదికపైనా తనదైన ముద్ర వేస్తున్నాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోవడంలో అతను ప్రదర్శిస్తున్న పరిణతిని క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  తన అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. అలాగే  ఆరెంజ్ క్యాప్ రేసులోనూ ముందంజలో నిలిచాడు.

By
en-us Political News

  
రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ.. డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.
హుస్సేన్ సాగర్ వైపు వెడుతుండగా, దారిలో రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే.. పోలీసులకు చెప్పుకుంటే తన కష్టం తీరుతుందేమోనన్న ఆశకలిగింది.
ఈ కేసులో కేటీఆర్ ఎసీబీ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయనను ఏసీబీ విచారించింది. చార్జిషీట్ కూడా ఫైల్ చేసింది. ఆ చార్జిషీట్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది.
మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
కేంద్ర భద్రతా సంస్థలు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని రన్‌వే నుంచి దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 110.50 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది.ఇక ఏపీలోని గుంటూరులో పెట్రోల్‌ లీటర్ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి చేరింది.
హాజీ అలీ నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పెట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను భగీరథ్ తరపున కోర్టులో వాదించిన న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి తోసిపుచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆయన వాదించారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్ మధ్య కీలక మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్షదీప్ తిలక్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అమర్యాదగా సంబోధించారు. పంజాబ్ కింగ్స్ కు అత్యంత కీలకమైన మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఈ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్ బ్యాటర్ తిలక్ వర్మ 75 నాటౌట్ తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలతో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.