భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

Publish Date:May 6, 2026

Advertisement

 

రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగరంలోని అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్ లో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర భద్రతా వ్యవస్థలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను మూడు సంవత్సరాల కాలానికి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించింది.

SSAగా శివధర్ రెడ్డి ప్రభుత్వానికి పోలీసింగ్, లా అండ్ ఆర్డర్, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత వంటి విభాగాల్లో సమగ్ర సలహాలు అందించనున్నారు. రాష్ట్రంలో మారుతున్న భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ భద్రతా వ్యూహాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్, స్మార్ట్ సర్వైలెన్స్ వ్యవస్థలు, నగర భద్రతా బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.పోలీసు శాఖలో దీర్ఘకాల సేవలతో పాటు అంతర్గత భద్రత, నక్సల్ వ్యతిరేక చర్యల్లో శివధర్ రెడ్డి విశేష అనుభవం సంపాదించారు. 

లా అండ్ ఆర్డర్ నిర్వహణ, ఇంటెలిజెన్స్ సేకరణ, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారి గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. రాష్ట్ర భద్రతా వ్యవస్థను సమర్థంగా సమన్వయం చేయగల అనుభవజ్ఞుడిగా ప్రభుత్వం ఆయనపై విశ్వాసం వ్యక్తం చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను శివధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర భద్రతా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.రాష్ట్రంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి శివధర్ రెడ్డి నియామకం కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది

By
en-us Political News

  
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుంది.. !
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.