TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

పులివెందులలో కాల్పులు: స్థానిక నామినేషన్ల వేళ అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్.!

స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ కడప జిల్లాలోని పులివెందుల ఉద్రిక్తతలకు వేదికగా మారింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ సందర్భంగా నామినేషన్ కేంద్రం వద్ద వైపీసీ, తెలుగుదేశం కూటమి శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. స్థానిక పోరుకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచే పులివెందులలో రాజకీయ వేడి తార స్థాయికి చేరింది. ఈ క్రమంలో శనివారం (సెప్టెంబర్ 17) నామినేషన్ల దాఖలుకు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నామినేషన్ కేంద్రానికి అత్యంత సమీపంలోకి రెండు వర్గాలకు చెందిన శ్రేణులు ఏకకాలంలో రావడంతో వాతావరణం హీటెక్కింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు, ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్యా రాళ్లు దాడులు జరిగాయి. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గొడవను అదుపు చేసేందుకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో లాఠీచార్జ్ జేశారు. అయినా ఫలితం లేకపోవడంతో గుంపులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. నామినేషన్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో హఠాత్తుగా లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉద్రిక్తతల నేపథ్యంలో చుట్టుపక్కల దుకాణాలను మూసివేశారు. కాగా ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు నామినేషన్ కేంద్రం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించి, పులివెందుల పట్టణంలో నిషేధాజ్ఞలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా నిఘా పెంచారు. ఈ ఘర్షణకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. [Pulivendula Election Tension, Pulivendula Police Firing, Local Body Elections, YCP, TDP Alliance Clash, Telugu One]

Published on: Sat Oct 17, 2026 3:22PM

political-news-img

బెజవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాథ: తొలి జాబితాలో ప్రకటించిన జనసేన.!

ఏలూరు కార్పొరేషన్ మేయర్.. 12 మునిసిపల్ కార్పొరేషన్ల అభ్యర్థుల ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన పార్టీ, తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు సంబంధించిన తొలి జాబితాను శనివారం (అక్టోబర్ 17) విడుదల చేసింది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ, మిత్రపక్షాలతో సయోధ్య కుదుర్చుకున్న అనంతరం జనసేన తన తొలి జాబితాను విడుదల చేసింది. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న జనసేన పార్టీ అధినాయకత్వం క్షేత్రస్థాయిలో పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. విడుదల చేసిన తొలి జాబితా ప్రకారం.. రాష్ట్రంలోని పలు కీలక మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనసేన మేయర్లు, ఛైర్మన్ పదవుల కోసం బరిలో నిలవనున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ వంటి ప్రముఖ మున్సిపల్ కార్పొరేషన్లలో జనసేన అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పరిధిలో ఉన్న సుమారు 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో కూడా జనసేన పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దించనుంది. రాజాం, పాలకొండ, సాలూరు వంటి ప్రాంతాలతో పాటు పలు ఇతర మున్సిపాలిటీలలోనూ పోటీ చేసే స్థానాల వివరాలను ఈ తొలి జాబితాలో ప్రకటించింది. కేవలం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకే పరిమితం కాకుండా, ఆయా స్థానాల పరిధిలోని డివిజన్లు, వార్డులలో పోటీ చేసే కార్పొరేటర్లు, కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. ఈ ఎన్నికల సన్నాహకాలను పార్టీ అధినాయకత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల సేవలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇప్పటికే అధికారికంగా బి-ఫారాలు పంపిణీ చేసే ప్రక్రియను కూడా పార్టీ కార్యాలయం ప్రారంభించింది. నామినేషన్ల గడువు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ప్రక్రియ వేగవంతం కావడం క్యాడర్‌లో కొత్త జోష్ నింపుతోంది. కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమన్వయ కమిటీలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంతో నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పరస్పర సహకారంతో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ తొలి జాబితా విడుదలతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు గట్టి పోటీ ఇస్తూ, స్థానిక స్థాయిలో జనసేన తన పట్టును నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను వేదికగా మలుచుకుంటోంది. రాబోయే రోజుల్లో మిగిలిన స్థానాల జాబితాలు కూడా వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు జనసేన శ్రేణులు సర్వసన్నద్ధమవుతున్నాయి. జనసేన ప్రకటించిన తొలి జాబితాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును ఖరారు చేసింది. అదేవిధంగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడును బరిలోకి దించుతున్నట్లు వెల్లడించింది. వీరితో పాటు 12 మున్సిపాలిటీలకు ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ ప్రకటించింది. ఆ వివరాలిలా ఉన్నాయి. అమలాపురం: నల్ల శ్రీధర్ చిలకలూరిపేట: తోట రాజేశ్వరి గొల్లప్రోలు: కడారి తమ్మయ్య నాయుడు నరసాపురం: కొత్తపల్లి శైలజ నిడదవోలు: కల్లం జ్యోతి పెడన: మట్టా శివపావని పిఠాపురం: బీరా విజయ్ శేఖర్ పుత్తూరు: డి. ఏలుమలై సాలూరు: గొర్లె విజయకుమారి సామర్లకోట: పిట్టా జానకీ రామారావు తెనాలి: టి. వెంకటరమణారావు తిరువూరు: పి. మాధవి అదలా ఉంటే పొత్తులో భాగంగా జనసేన మొత్తం నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు (శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ), 21 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో పోటీ చేయనుంది. [Janasena Rlease 1st list Candidates, Local Body Elections, AP local body elections, Pawan Kalyan Jana Sena, Vijayawada Mayor, Janasena Candidate, Vangaveeti Radha, Telugu One]

Published on: Sat Oct 17, 2026 2:31PM

political-news-img

ఈ నెలలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ఆమోదం కోసమేనా.?

కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లలను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని భావిస్తోంది. ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బిల్లులకు అవసరమైన మద్దతు లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం. కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో కేంద్రానికి అవసరమైన మద్దతు లభించలేదు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండోంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఈ బిల్లుతో అనుసంధానమైన ఇతర బిల్లులపై కేంద్రం ముందుకు వెళ్లలేదు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చర్చలో అసలు సమస్య మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలా వద్దా అన్నదొక్కటే కాదు. ఆ రిజర్వేషన్లను ఏ విధానంలో అమలు చేయాలి? నియోజకవర్గాల సంఖ్యను ఎలా మార్చాలి? రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్న ప్రశ్నలు కూడా కీలకంగా మారాయి. అన్నిటికీ మించి మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చట్టం 2023లోనే ఆమోదం పొందింది. అయితే దాని అమలు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో ముడిపడి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రతిపాదించిన మార్పులు మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే అంశంతో కలిసి ఉంది. అదే వివాదానికీ కారణంగా మారింది. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంపై రాజకీయంగా దాదాపు అన్ని పార్టీలూ మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆ రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంటే.. నియోజకవర్గాల పేర్లు, సరిహద్దులు మార్చడం మాత్రమే కాదు.. ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉంటాయి? ఏ ప్రాంతానికి ఎంత రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుంది? వంటి అంశాలపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే ఈ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా డీఎంకేతో చర్చలు సాగుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరికొన్ని చిన్న పార్టీల మద్దతును కూడా కూడగట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో? [Special Session Parliament, Womens Reservation Bill, Delimitation Bill, Redrawing Constituencies, Central Government, DMK, Discussions, Telugu One]

Published on: Fri Oct 16, 2026 11:50AM

political-news-img

ఏపీ పంచాయతీ ఎన్నికలు: కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతకొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కూటమి సీట్ల పంచాయితీకి ఎట్టకేలకు తెరపడింది. ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు మూడు పార్టీలు ఎక్కడెక్కc ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలో స్పష్టత వస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. తాజా లెక్కల ప్రకారం, జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 4 కార్పొరేషన్‌లు, 21 మున్సిపాలిటీలను కేటాయించారు. అలాగే మిత్రపక్షమైన బీజేపీకి 2 కార్పొరేషన్‌లు, 7 మున్సిపాలిటీలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో తమ ప్రాబల్యాన్ని బట్టి కనీసం 40 శాతం సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబ ట్టినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆ పార్టీ అధినేతతో చర్చించి జనసేనను. 20 శాతం లోపు సీట్లకే పరిమితం కావడానికి ఒప్పించారు. మరోవైపు బీజేపీ పెద్దగా పట్టుబట్టకపోయినా, రాజమండ్రి, అనంతపురం కార్పొరేషన్‌లతో పాటు 7 మున్సిపాలిటీలను కేటాయించడం గమనార్హం. రాజమండ్రిలో లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ ఆ సీటు ఇవ్వడం సహజమే అయినప్పటికీ, అనంతపురం కార్పొరేషన్‌ను కూడా కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు తన వ్యూహాత్మక రాజకీయాలతో జనసేనను ఆ పార్టీ కోరినన్ని స్థానాల కోసం పట్టుబట్టకుండా ఒప్పించగలిగారని పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు తనదైన శైలిలో కూటమిలో సీట్ల సర్దుబాటును పూర్తి చేసి తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. [Ap Localbody Elections, Telugudesham Kutami Seat Sharing, Janasena TDP BJP AP Politics Telugu One]

Published on: Fri Oct 16, 2026 10:14AM

political-news-img

బొద్దింకలకు జగన్ మద్దతు: వ్యూహాత్మకమా.. బీజేపీతో తెగతెంపులా.?

దేశ రాజకీయాలలో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు, యువత సమస్య పరిష్కారం డిమాండ్ తో ఆ పార్టీ చేపడుతున్న ఆందోళనలు, ఉద్యమాలకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అయితే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సీజేపీకి మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ) జ్ఞానేశ్ కుమార్ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, ఆందోళనలకు జగన్ మద్దతు పలికారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగిన సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్ , అశుతోష్ రాంకా తదితరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రైవేట్ ప్రాంగణాల ద్వారా నిరసన ప్రదేశంలోకి ప్రవేశించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు వారిపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 19 వరకు 5 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తీహార్ జైలుకు తరలించారు. ఈ అరెస్టులను వైసీపీ అధినేత జగన్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ మద్దతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం మళ్లీ పునరుద్ధరించబడాలని, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులు సమస్యను పరిష్కరించలేవని జగన్ సామాజిక మాధ్యవ వేదికగా షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ సీజేపీకి మద్దతు పలకడం వ్యూహాత్మకమా? లేక బీజేపీతో తెగతెంపులకు సంకేతమా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. జగన్ బొద్దింకలకు మద్దతుగా సామాజిక మాధ్యమ వేదికగా మద్దతు పలకడాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఎద్దేవా చేశారు. ఈడీ , సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ ఏపీలో అధికారంలో ఉన్న కాలంలో జరిగిన అరాచకాలు, హింసాత్మక ఘటనలను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ప్రజాస్వామ్య బద్ధంగా తగిన సమయంలో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని మాధవ్ హెచ్చరించారు. [YS Jagan upport Cockroach Janta Party, Condemn CJP Leaders Arres, YCP Political Strategy, Election Commission India, Telugu One]

Published on: Fri Oct 16, 2026 9:50AM

political-news-img

పారిపోయింది నేను కాదు వల్లభనేని వంశీ: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.!

గన్నవరం రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం మరొకసారి పీక్స్ కు చేరింది. మాజీ, ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ విసిరిన విమర్శలు, సవాళ్లకు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాస్ కౌంటర్ ఇచ్చారు. గురువారం (అక్టోబర్ 15) మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ.. తన వెనుక ఒక బలమైన నాయకుడు ఉన్నారని, ఆయన కుమారుడు ప్రతి అంశంలోనూ లెక్కలు సరిగ్గా సరిచేస్తారని పరోక్షంగా చంద్రబాబు, లోకేష్ లను ప్రస్తావిస్తూ వల్లభనేని వంశీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ వంశీని నిలదీశారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి గెలిచి, నిలిచిన తనను పపారిపోయానని వంశీ విమర్శించడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, గతంలో గన్నవరం అసెంబ్లీ టికెట్ దక్కక నియోజకవర్గాన్ని వదిలి విజయవాడకు పారిపోయింది తాము కాదని, వంశీయేనని స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నామని, పారిపోయే తత్వం తని కాదని యార్లగడ్డ అన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం మాని, చేసిన తప్పులను ఒప్పకోవాలని వంశీకి హితవు పలికారు. గన్నవరం అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తమ ప్రాధాన్యమని, నిందలు వేసే నాయకులకు స్థానిక ప్రజలే త బుద్ధి చెబుతారన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి అంశంపైనా స్పష్టత వస్తుందని, అక్రమాలకు, అనవసర విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని యార్లగడ్డ విశ్వాసం వ్యక్తం చేశారు. [Yarlagadda Venkat Rao Counter Vallabhaneni Vamsi, Gannavaram Politics, Gannavaram MLA, AP Political News, Telugu One]

Published on: Thu Oct 15, 2026 4:10PM