చిన్న తరహా నీటి ప్రాజెక్టుల మంత్రి టిజి వెంకటేష్ కేంద్ర దేశీయవ్యవహారల మంత్రి, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జ్ వాయిలార్ రవిని కలిశారు. రాష్ట్రంలో బాగా వెనుక బడిన ప్రాంతంగా రాయలసీమ వుందని ఇదే విషయాన్ని శ్రీకృష్ట కమిటీ కూడా తేల్చిందని ఇందుకు గాను వారు సిక్కిం ప్రభుత్వానికి ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని టిజి వెంకటేష్ కోరారు. అలాగే రాయలసీమలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఎక్సైజ్ సంకం నుండి మినహాయింపు నివ్వాలని కోరారు. రాయలసీమలో అంతులేని ఖనిజసంపద వుందని దాని ద్వారా పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు వివరించారు. అయితే ఇప్పటివరకు పని చేసిన ప్రభుత్వాలేవీ వ్యవసాయ అభివృద్దికి గాని, మంచినీటి సమస్య కు గాని సరైన పరిష్కారం చూపలేకపోయారని టిజి వెంకటేష్ ఆరోపించారు. రాష్ట్ర సమైఖ్యంగా వుంటే తమకు ఏ సమస్యా లేదని ఒక వేళ రాష్ట్రం విడిపోతే మాత్రం రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని, అదే సమయంలో లక్షకోట్లు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. రాయల సీమలోని 4 జిల్లాలయిన కర్నూలు, అనంతపూర్, కడప,చిత్తూర్ జిల్లాకు ఒక్కోజిల్లాకు 25,000 వేల కోట్లను అభివృద్దికి కెటాయించాలన్నారు. 1953 లో ఆంద్రరాష్ట్రానికి రాజధానిగా వుందని ఆతరువాత పరిణామాల అనంతరం హైదరాబాద్ రాజధాని అయ్యిందని దాంతో రాయలసీమ అభివృద్దికి నోచుకోలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చిర్చించి నిర్ణయం తీసుకుంటామని వాయిలార్ రవి హామీ ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-tg-venkatesh-24-17990.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.