అవగాహన అన్నిటా వుండాలి కదా....!

Publish Date:Oct 8, 2012

Advertisement

 

 

జీవవైవిధ్యంపై ప్రజల్లో చైనత్యం కల్సించాల్సిన అవసరం ఉందని హెచ్‌ఐసిసిలో జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుకు సంబంధించిన అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షిస్తూ అన్నివర్గాల ప్రజలకు జీవవైవిధ్యం ప్రాధాన్యం గురించి వివరించాల్సిన అవసరం ఉందని, విద్యాసంస్థలు, గ్రామాలు, గిరిజన తండాల్లో ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఖండాంతర ఖ్యాతి గాంచిన ఒంగోలు ఎద్దులు, పుంగనూరు ఆవులు, నెల్లూరు గొర్రెలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అరుదుగా లభించే పశు పక్ష్యాదుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిజమే! గిరిజన తండాల్లో జీవవైవిధ్యం గురించి తెలియజేయడమంటే.. వారుండే ప్రకృతి గురించి వారికి చెప్పడమే. ఎందుకంటే ఇప్పటివరకు అడవుల్లో నివసించే గిరిజన తండాల వల్లే కాస్తోకూస్తో అడవులు, అందులోని ప్రాణులు జీవిస్తున్నాయంటే అతిశయోక్తికాదు. నాగరికం నేర్చిన మనిషే వన్యప్రాణులను చంపి తిన్న సంగతి... తింటున్న సంగతి ప్రజలకు తెలిసిన విషయమే. ఎంతో వృక్ష సంపద ఈ తండాలవల్లే రక్షించబడుతోందని చెప్పవచ్చు. ఎద్దులు, ఆవులు, గొర్రెలు, అరుదైన పశుపక్ష్యాదుల గురించి... ఇప్పటికే దేశానికి చెందిన వాటిపై పేటెంట్ల పేరుతో వాటిపై తమకే హక్కువుందని విదేశాలు తమ దుర్భుద్ధిని బయటపెట్టుకున్నాయి. వేప, పసుపు.. ఇలా ఎన్నిటిపైనో.. వాటిపైకన్నుంది... కొత్తగా జాతికే గర్వకారణమై.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిపొందిన ఒంగోలు గిత్తలపై వాటి దృష్టి పడిరది...ఇప్పటికే సంకరం చేసి స్వచ్ఛమైన జాతికి మచ్చ తెస్తున్నారు.. ఇటువంటివాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశీ మార్కెట్లతో భారతదేశాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నట్లే... భవిష్యత్‌లో మనకు గుర్తింపుతెచ్చిన ఒంగోలు గిత్తలు.. తదితరాలను వారికి ఉదారంగా మీవేనంటూ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు...మన నాయకులు ప్రజల ఓట్లతో గెలిచినా... ప్రజలనుకంటే... విదేశీ రాజకీయాలనే ఎక్కువగా నమ్ముతారు.... అయినా జీవవైవిధ్యమంటే అన్నివిధాలా వాటిని కాపాడుకోవడం! అది చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తే బావుంటుంది.. అవగాహన అంటే ఎన్నికల సమయంలో కనిపించినట్లుగా కాదు సుమా...!

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.