ఊహాగానాలు వద్దు మీడియాకు సీబీఐ జేడీ హితవు

Publish Date:Jan 31, 2012

Advertisement

హైదరాబాద్ : మీడియాపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్త పరిచారు. ఆయన ఉదయం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విచారణలో ఉన్నవారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించామన్నది అవాస్తవమని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. తాము ఇచ్చిన అధికారిక సమాచారాన్నే మీడియాలో ప్రసారం చేయాలని ఆయన సూచించారు. మీడియా ఊహాజనిత వార్తలకు దూరంగా ఉండాలన్నారు.అలాంటి వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై పీఐబీకి లేఖ రాస్తామని ఆయన అన్నారు.  నిజంగా ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలన్నారు. తాము ఎవ్వరినీ ఉద్దేశ్య పూర్వకంగా అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. అందరినీ విచారణ కోసమే అరెస్టు చేశామన్నారు. ఆయా కేసుల్లో ఎవరి ప్రమేయముందని తెలిసినా విచారిస్తున్నామని చెప్పారు.

తామెవరిపైనా థర్డ్ డిగ్రీ చర్యలు తీసుకోవడం లేదనీ, అదేవిధంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ విచారణలను కూడా జరపడం లేదని చెప్పారు. నేరం పాల్పడినట్లు అభియోగాలు నమోదైనవారిపై విచారణ జరపడమే తమ విధి అని అన్నారు.  సీబీఐ విచారణాంశాలను ఎవరికీ లీక్ చేయటం లేదని స్పష్టం చేశారు.కేసుల విచారణలో ప్రభుత్వం నుంచి మరికొంత సహకారం, సమన్వయాన్ని కోరినట్లు తెలిపారు. మీడియా వారు సీబీఐ విచారణ గురించి ఏదైనా రాసేటట్లయితే నిజం తెలుసుకుని రాయాలని సూచించారు. అంతేతప్ప ఏవో ఊహాగానాలు రాయవద్దని హితవు పలికారు. ఏదైనా జరిగితే తామే ప్రస్ నోట్ ద్వారానో, ఎస్ఎమ్ఎస్ ద్వారానో తెలియజేస్తామని వెల్లడించారు.
 

By
en-us Political News

  
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.