ఎల్ నినో ఎఫెక్ట్: బాసర త్రిపుల్ ఐటీ దసరా సెలవులు పొడగింపు.!
Publish Date:Oct 23, 2026
Advertisement
ఎల్ నినో ఎఫెక్ట్ వ్యవసాయంపైనే తీవ్రంగా చూపుతోందని అంతా భావిస్తున్నారు. కానీ విద్యా సంస్థలపైనా, విద్యార్థులపైనా కూడా ఎల్ నినో ప్రభావం పడింది. విద్యాలయాల్లో, హాస్టళ్లలో నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు విద్యా సంస్థలపైనా పడుతోంది. తాజాగా బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులకు దసరాసెలవులను పొడిగించారు. బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ఇతర అవసరాలకు కావలసిన నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన విశ్వవిద్యాలయ పాలనా యంత్రాంగం, క్యాంపస్‌లో నెలకొన్న ఈ తాగునీటి సంక్షోభం కొద్దిరోజుల్లో పరిష్కారం కాకపోవచ్చని భావించి, విద్యార్థుల ఇబ్బందిని నివారించేందుకు దసరా సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సెలవులు ముగిసి విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగి వస్తే నీటి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల పొడిగింపునకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ ఇళ్ల నుంచి క్యాంపస్‌కు ఎప్పుడు రావాలనే సమాచారాన్ని త్వరలోనే మళ్లీ వెల్లడిస్తామని పేర్కొన్నారు.
[Elnino Effect On Basara IIIT, RGUKT Basara, Dasara Holidays Extended, Basara IIIT Water Crisis, Telangana, Telugu One]
http://www.teluguone.com/news/content/elnino-effect-on-basara-iiit-24-235191.html




