వీడిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసు మిస్టరీ..మాజీ జవానే అసలు సూత్రధారి..!
Publish Date:Sep 11, 2026
Advertisement
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్..! బొల్లారం ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ కంపెనీలో ఆయుధాలు చోరీకి గురైన ఘటనపై దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. గత నెల 31వ తేదీ తెల్లవారుజా మున బొల్లారంలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ కంపెనీలో ఆయుధాలు దొంగిలించి నట్లు డీజీపీ తెలిపారు. అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న వినోద్ కుమార్ నాయక్ ఆయుధాలు మాయమైన విషయాన్ని గుర్తించి పోలీ సులకు ఫిర్యాదు చేయ డంతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు డీజీపీ వివరించారు.మొదటి బిల్డింగ్ నుంచి ఏడు పిస్తోళ్లు, 13 మ్యాగజైన్లు, నాలుగు ఏకే-203 ఆయుధాలు, 5.56 ఎంఎం మందు గుండు సామగ్రితో పాటు పలు ఆయుధాలు దొంగిలించబడినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అలాగే రెండో బిల్డింగ్ నుంచి కూడా మరికొన్ని ఆయుధాలు, బుల్లెట్లు మాయమైనట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి దర్యాప్తు చేపట్టారని డీజీపీ తెలిపారు. తొలుత ఈ వ్యవహారంలో బయట వ్యక్తుల ప్రమేయం లేదని, ఇన్‌సైడర్ల ప్రమేయమే ఉండే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. అయితే మొదటి దశ విచారణలో ఎవరూ కూడా పోలీసుల విచారణకు సహకరిం చలేదని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తూ అత్యాధునిక ఆయుధాలను ఎవరెవరు ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని గుర్తించామని డీజీపీ తెలిపారు. మొత్తం 16 మంది రెగ్యులర్‌గా ఈ ఆయుధాలను ఉపయోగి స్తున్నట్లు గుర్తించినట్లు డీజీపీ వెల్లడించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ అందించిన సమాచారంతో సెలవులో ఉన్న 54 మందిని గుర్తించామని, పెన్షన్ ఔట్ అయిన ఏడుగురిని కూడా విచారించామని సీవీ ఆనంద్ తెలిపారు. ఆయుధాల చోరీ వెనుక డ్రగ్ మాఫియా కోణం ఏమైనా ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలించినట్లు డీజీపీ చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్‌ను సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ నిపుణులను రంగంలోకి దించి ఆధారాలను పరిశీలించినట్లు ఆయన వివరించారు.ఈ క్రమంలో ఎన్‌సీఓ వినోద్ కుమార్, బల్లి మధు అనే ఇద్దరిపై అనుమానం వచ్చిందని సీవీ ఆనంద్ తెలిపారు. ఇద్దరినీ అనుమానించి లోతుగా విచారణ చేపట్టినప్పటికీ, వారి నుంచి కేసుకు సంబంధించి చిన్న క్లూ కూడా లభించలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పెన్షన్ ఔటర్స్‌లో మరో ఇద్దరిని కూడా విచారించినట్లు డీజీపీ వెల్లడించారు. మల్లేష్ అలియాస్ రాజును కూడా విచారించి ఆయుధాల చోరీకి సంబంధించి అతడి పాత్రపై ఆరా తీసినట్లు తెలిపారు. ఆయుధాలు భద్రంగా ఉండాల్సిన ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోనే భారీగా ఆయుధాలు, బుల్లెట్లు మాయమైన ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్‌సైడర్ల పాత్ర, ఆయుధాలను రెగ్యులర్‌గా ఉపయోగించే వ్యక్తుల వివరాలు, సెలవులో ఉన్న సిబ్బంది, పెన్షన్ ఔట్ అయిన వ్యక్తులు, డ్రగ్ మాఫియా కోణం ఇలా అన్ని అంశాలను పరిశీలిస్తూ అసలు ఆయుధాలు ఎక్కడికి వెళ్లాయి, ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనే విషయాలను తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. [ Madras Army Regiment, Weapons theft case, Bollaram, Retired Army Officer, Mahabub Nagar, Nagarkurnool, Crime news, Minister Rajnath Singh,Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/madras-army-regiment-24-231265.html




