చిరు బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని.. ఏం జరుగుతోంది?

Publish Date:Aug 24, 2026

Advertisement

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గుడివాడలో మాత్రం చిరంజీవి బర్త్ డే వేడుకలు ఒకింత ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఇందుకు కారణంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, గతంలో జనసేన అధినేత, చిరంజీవి సోదరుడు అయిన పవన్ కల్యాణ్ పై ఇష్ఠారీతిగా నోరు పారేసుకున్న కొడాలి నాని గుడివాడలో జరిగిన చిరు బర్త్ డే వేడుకల్లో స్వయంగా పాల్గొని కేక్ కట్ చేశారు.  గుడివాడ  చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు, వైసీపీ శ్రేణులూ కలిసి ఈ కర్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా కొడాలి నాని చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు.  స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి..  ఎంతోమంది యువ నటులకు మార్గదర్శకుడిగా, స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.    

ఐదేళ్ల పాటు అంటే వైసీపీ అధికారంలో ఉన్న 2019,  2024 మధ్య కాలంలో ఇదే కొడాలి నాని.. పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. అటువంటి కొడాలి నాని గత కొంత కాలంగా తన నోటిని అదుపులో పెట్టుకుని తాను మారాను అన్న సంకేతాలు ఇవ్వడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం తరువాత కొడాలి నాని.. తన నోటి దురుసుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.

అయినప్పటికీ ఆయనపై ఉన్న బూతుల నాని ముద్ర ఇసుమంతైనా తగ్గలేదు. ఇప్పుడు హఠాత్తుగా  పవన్ సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, తాను మారిపోయానని,  మెగా అభిమానులను నమ్మించడానికి ప్రయత్నాలు చేశారు.  చిరంజీవి పట్ల ఆయనలో అకస్మాత్తుగా కలిగిన ఈ ఆదరణకు ఇదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే చిరు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని ఫొటోను జత చేస్తూ నెటిజనులు.. జగన్ హయాంలో  పవన్ కళ్యాణ్ పట్ల నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నెట్టింట పోస్టు చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాపం తాను మారానని చెప్పుకోవడానికి నాని చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదని పరిశీలకులు అంటున్నారు.  

Kodali Nani in Chiranjeevi Birthday celebrations, Megastar Birthday Celebrations Gudivada, Megafans, TeluguOne, Ap Politics 

By
en-us Political News

  
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.
మొత్తం 87 మున్సిపాలిటీలలో ఎన్డీయే కూటమి ఏకంగా 63 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదు చేసింది.   తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 45 మున్సిపాలిటీలను గెలుచుకోగా, జనసేన   15 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధించాయి. మరోవైపు, వైసీపీ   5 మున్సిపాలిటీలకే పరిమితమై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఇతరులు   3 స్థానాలను దక్కించుకున్నారు.
తుఫాన్‌ కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నందికొట్కూరులో బైరెడ్డి మార్క్ రాజకీయం.. వ్యూహం సక్సెస్.!
ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ప్రతి రౌండ్‌లోనూ ఓట్ల ఆధిక్యాన్ని పెంచుకుంటూ  , అంతిమంగా తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై   4 వేల 380 ఓట్ల భారీ మెజార్టీతో  విజయం సాధించారు.  
విచారణకు హాజరయ్యే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఆధారాలను తీసుకురావాలని ఈడీ అధికారులు తమ నోటీసుల్లో  పేర్కొన్నారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్‌లతో పాటు 2019 సంవత్సరం నుంచి అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న కంపెనీల వివరాలు, దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాలు, బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించారు.
పోలీసు శాఖ ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా పని చేయడం వెనుక ఉన్నది కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. దీంతో ఇప్పుడాయన పేరు రాజకీయవర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మార్మోగిపోతోంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేసే అధికారిగా ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.  
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.  రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు   అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా  చర్యలు తీసుకున్నారు. 
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన  బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో  తుఫాన్  ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి విదితమే.  ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.