విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) రిఫైనరీ ప్రాంగణంలో మంగళవారం (నవంబర్ 2) రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నూతనంగా నిర్మించిన కూలింగ్ టవర్ ప్రాంతంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం కారణంగా ప్రాంగణమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో స్థానికులు తీవ్ర తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రిఫైనరీకి సమీపంలో ఉన్న మల్కాపురం, శ్రీహరిపురం, సింధియా తదితర ప్రాంతాల ప్రజలు దట్టమైన పొగ కారణంగా ఉక్కిరిబిక్కిరై ఇబ్బందులు పడ్డారు. విషవాయువులు విడుదలవుతున్నాయనన్న భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా చర్యలు తీసుకున్నారు.
ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సాంకేతిక లోపమా, మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. . ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. రక్షణ చర్యల్లో భాగంగా ప్లాంట్ అధికారులు ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరాని నిలిపివేసి, ప్రమాద ప్రాంతంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/visakhapatnam-hpcl-fire-43-236108.html
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో తుఫాన్ ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి.
నిజాంపట్నం, వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖ ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతిలో తనను కలిసిన కేంద్ర బృందంతో సమావేశంలో తుఫాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించిన చంద్రబాబు, త్వరితగతిన కేంద్రం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.
టీటీడీ పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యేంత వరకూ టీటీడీ సమగ్ర నిర్వహణ బాధ్యతలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ (స్పెసిఫైడ్ అథారిటీ) ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన మురసు తుపాను వేగంగా కదులుతూ తీరం వైపు దూసుకొస్తోందన్నవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు, పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.
స్వర్గస్థులైన బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళు లర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. పాఠశాల ప్రాంగణంలో ఓ దుండగుడు జరిపిన పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్సకు స్పందిస్తున్నదనీ, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులను ఉటంకిస్తూ నారా లోకేష్ తెలిపారు.
పరారీలో ఉన్న నిందితుడిని గాలిస్తుండగా పోలీసులకు సదరు నిందితుడు ఎదురుపడ్డాడు. పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ నిందితుడు పట్టించుకోలేదు సరికదా పోలీసులపై ఎదురు తిరిగాడు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆత్మసంరక్షణార్థంపోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.