మునిసిపోల్స్ ఓట్ల లెక్కింపు: సాయంత్రానికల్లా ఫలితాలు.!

Publish Date:Nov 2, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో  మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం (నవంబర్ 8)  ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది. మునిసిపోల్స్ ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది.  

 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం (నవంబర్ 1) పోలింగ్ జరిగిన సంగతి విదితమే.  ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 96 లక్షల 89 వేల 061 మంది ఓటర్లకు గాను 60 లక్షల22 వేల 411 మంది అంటే దాదాపు 62 శాతం మంది తమ ఓటు హక్కు  వినియోగించుకున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. మొత్తం 556 కౌంటింగ్ హాళ్లు, 6 వేల 831 టేబుళ్లను ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపునకు 47 వేల 817 మందిని నియమించింది. అత్యధికంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు 10 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద  సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతారు.

ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం కూటమి,  వైసీపీ మధ్య పోరు నెలకొంది.  మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కొత్త చట్టం  ప్రకారం మేయర్లు, ఛైర్‌పర్సన్‌లకు ప్రత్యక్ష ఎన్నిక జరగడంతో  ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది.   మేయర్, ఛైర్‌పర్సన్ పదవులకు 520 మంది, వార్డులు, డివిజన్ స్థానాలకు 10 వేల మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. కొన్నిచోట్ల ఫిర్యాదుల నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించారు. లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. లెక్కింపు పూర్తయిన వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు.

[Ap Municipal Elections, Vote Counting, Results, State Election Commission, Arrangements, Telugu One]

By
en-us Political News

  
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.  రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు   అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా  చర్యలు తీసుకున్నారు. 
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన  బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో  తుఫాన్  ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
నిజాంపట్నం, వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖ ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతిలో  తనను కలిసిన కేంద్ర బృందంతో సమావేశంలో  తుఫాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించిన చంద్రబాబు, త్వరితగతిన కేంద్రం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.
టీటీడీ పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యేంత వరకూ   టీటీడీ సమగ్ర నిర్వహణ బాధ్యతలను  ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక  కమిటీ (స్పెసిఫైడ్ అథారిటీ) ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన మురసు తుపాను వేగంగా కదులుతూ తీరం వైపు దూసుకొస్తోందన్నవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో  తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు, పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.  
స్వర్గస్థులైన బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళు లర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు.  పాఠశాల ప్రాంగణంలో ఓ దుండగుడు జరిపిన పాశవిక దాడిలో  తీవ్రంగా గాయపడిన  బాలిక చికిత్సకు స్పందిస్తున్నదనీ, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులను ఉటంకిస్తూ నారా లోకేష్ తెలిపారు.  
పరారీలో ఉన్న నిందితుడిని గాలిస్తుండగా పోలీసులకు సదరు నిందితుడు ఎదురుపడ్డాడు. పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ నిందితుడు పట్టించుకోలేదు సరికదా పోలీసులపై ఎదురు తిరిగాడు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆత్మసంరక్షణార్థంపోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.  
తుపాను తీరం దాటే సమయంలో . తీరం దాటే సమయంలో గంటకు   110 కిలోమీటర్లకు పైబడిన వేగంతో  వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.  ఈ తుపాను ప్రభావం  దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాపై తీవ్రంగా ఉ:టుంది. తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.