మురసు తుపాను తీరం దాటింది. మంగళవారం (నవంబర్ 2)అర్ధరాత్రి దాటిన బుధవారం తెల్లవారు జామున (దాదాపు ఒంటింట ప్రాంతంలో తుఫాన్ ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది. తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. , రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల చెట్లు కూలాయి. అలాగే కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, , గుంటూరు జిల్లాల్లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్న అంచనాలతో పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అదలా ఉంటే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెల్లవారు జామున మూడున్నర గంటలకు తుపాను తీవ్రత, వర్షాలు, నష్టం, సహాయక చర్యలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి రాకుండా చూడాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు సోమవారం నుంచి దాదాపుగా ఆర్టీజీసీలోనే ఉంటూ తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షంచారు. రాత్రి 10 గంటలకు ఒకసారి, తెల్లవారుజామున మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడమే కాకుండా, ప్రతి గంటకు అధికారుల నుంచి సమాచారం తీసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
[Murasu Cyclone Land Fall, Heavy Rains, Bapatla, repalle, CBN, reciew, Telecinference, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/murasu-cyclone-land-fall-43-236106.html
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా చర్యలు తీసుకున్నారు.
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి.
నిజాంపట్నం, వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖ ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతిలో తనను కలిసిన కేంద్ర బృందంతో సమావేశంలో తుఫాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించిన చంద్రబాబు, త్వరితగతిన కేంద్రం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.
టీటీడీ పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యేంత వరకూ టీటీడీ సమగ్ర నిర్వహణ బాధ్యతలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ (స్పెసిఫైడ్ అథారిటీ) ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన మురసు తుపాను వేగంగా కదులుతూ తీరం వైపు దూసుకొస్తోందన్నవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు, పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.
స్వర్గస్థులైన బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళు లర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. పాఠశాల ప్రాంగణంలో ఓ దుండగుడు జరిపిన పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్సకు స్పందిస్తున్నదనీ, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులను ఉటంకిస్తూ నారా లోకేష్ తెలిపారు.
పరారీలో ఉన్న నిందితుడిని గాలిస్తుండగా పోలీసులకు సదరు నిందితుడు ఎదురుపడ్డాడు. పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ నిందితుడు పట్టించుకోలేదు సరికదా పోలీసులపై ఎదురు తిరిగాడు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆత్మసంరక్షణార్థంపోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తుపాను తీరం దాటే సమయంలో . తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్లకు పైబడిన వేగంతో వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావం దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాపై తీవ్రంగా ఉ:టుంది. తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.