పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లోనూ రీపోలింగ్నిర్వహించాలని, విచారణ పూర్తయ్యే వరకు కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం బుధవారం (నంబర్ 3) ఉదయం ఏడున్నరకు కీలక తీర్పు వెలువరించింది.
మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల, వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై మంగళవారం (నవంబర్ 2)విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తీర్పు ఈ ఉదయం ఏడున్నరకు రిజర్వ చేసిన సంగతి విదితమే. ఆ మేరకు బుధవారం (నవంబర్ 2) ఉదయమే తీర్పు వెలువరించింది.
వైసీపీ నేతల పిటిషన్ డిస్మిస్ చేసింది. పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. వైసీపీ నేతలు దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ డిస్మిస్ చేసింది, దీంతో పులివెందుల మునిసిపోల్స్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ యధావిదిగా జరగనుంది.
[AP High Court Dismiss YCP Petitions, Puluvendula Municipal Election, Repoling, Halt, Counting, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-high-court-dismiss-ycp-petitions-43-236107.html
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా చర్యలు తీసుకున్నారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో తుఫాన్ ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి.
నిజాంపట్నం, వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖ ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతిలో తనను కలిసిన కేంద్ర బృందంతో సమావేశంలో తుఫాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించిన చంద్రబాబు, త్వరితగతిన కేంద్రం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.
టీటీడీ పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యేంత వరకూ టీటీడీ సమగ్ర నిర్వహణ బాధ్యతలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ (స్పెసిఫైడ్ అథారిటీ) ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన మురసు తుపాను వేగంగా కదులుతూ తీరం వైపు దూసుకొస్తోందన్నవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు, పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.
స్వర్గస్థులైన బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళు లర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. పాఠశాల ప్రాంగణంలో ఓ దుండగుడు జరిపిన పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్సకు స్పందిస్తున్నదనీ, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులను ఉటంకిస్తూ నారా లోకేష్ తెలిపారు.
పరారీలో ఉన్న నిందితుడిని గాలిస్తుండగా పోలీసులకు సదరు నిందితుడు ఎదురుపడ్డాడు. పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ నిందితుడు పట్టించుకోలేదు సరికదా పోలీసులపై ఎదురు తిరిగాడు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆత్మసంరక్షణార్థంపోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తుపాను తీరం దాటే సమయంలో . తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్లకు పైబడిన వేగంతో వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావం దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాపై తీవ్రంగా ఉ:టుంది. తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.