షీ ప్లే.. బాలికల్లో క్రీడా వికాసానికి కీలక ముందడుగు.!

Publish Date:Aug 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినులను క్రీడల్లో  ప్రోత్సహించేందుకు,  అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం షీ ప్లే విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు.  విశాఖపట్నంలోని మధురవాడ పరిధిలో ఉన్న చంద్రంపాలెం  జడ్పీ ఉన్నత పాఠశాలలో  ఆరున్నర కోట్ల రూపాయల   భారీ వ్యయంతో దివీస్ ల్యాబ్స్  ప్రాజెక్ట్ చంద్ర నిధులతో ఆధునీకరించిన క్లాస్‌రూమ్‌లు,   స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా  మంత్రి నారా లోకేష్..   సాధారణంగా పాఠశాల స్థాయిలో బాలికలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయనీ,  సమాజం నుంచీ, కుటుంబం నుంచీ పెద్దగా ప్రోత్సాహం ఉండదనీ, అలాగే పాఠశాలల్లో   క్రీడా వసతులు అందుబాటులో ఉ:డకపోవడంతో   ప్రతిభావంతులైన బాలికలు వెనకబడిపోతున్నారన్నారు. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేలా ప్రతీ ప్రభుత్వ పాఠశాలలోనూ  క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయడంతో పాటు బాలికలకు విస్తృతమైన అవకాశాలు కల్పించడమే  షీ ప్లే' విధానం లక్ష్యమని చెప్పారు. 

ఈ సందర్భంగా తెలుగు క్రీడాకారిణి, క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి సాధించిన ఘనతను మంత్రి ఉదాహరించారు. ప్రారంభంలో ఆమె క్రీడల్లోకి రావడంపై కుటుంబ సభ్యుల నుంచి ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఆమె పట్టుదలను చూసి వారు మద్దతుగా నిలిచారని, సరైన ప్రోత్సాహం అందిస్తే మన ఆడబిడ్డలు ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉంటారని శ్రీచరణి నిరూపించారన్నారు.

అలాగే చంద్రంపాలెం స్కూల్ నుంచే ఇద్దరు విద్యార్థినులు ఇప్పటికే బాస్కెట్‌బాల్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించడం  గర్వకారణమన్నారు.   ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్  విద్యార్థులతో  ముఖాముఖి సంభాషించారు.   విద్యార్థినులతో కలిసి వాలీబాల్ ఆడారు.    

A key step forward for sports development among girls, She Play, Policy, Minister, Nara Lokesh

By
en-us Political News

  
మొత్తం 87 మున్సిపాలిటీలలో ఎన్డీయే కూటమి ఏకంగా 63 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదు చేసింది.   తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 45 మున్సిపాలిటీలను గెలుచుకోగా, జనసేన   15 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధించాయి. మరోవైపు, వైసీపీ   5 మున్సిపాలిటీలకే పరిమితమై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఇతరులు   3 స్థానాలను దక్కించుకున్నారు.
తుఫాన్‌ కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నందికొట్కూరులో బైరెడ్డి మార్క్ రాజకీయం.. వ్యూహం సక్సెస్.!
ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ప్రతి రౌండ్‌లోనూ ఓట్ల ఆధిక్యాన్ని పెంచుకుంటూ  , అంతిమంగా తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై   4 వేల 380 ఓట్ల భారీ మెజార్టీతో  విజయం సాధించారు.  
విచారణకు హాజరయ్యే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఆధారాలను తీసుకురావాలని ఈడీ అధికారులు తమ నోటీసుల్లో  పేర్కొన్నారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్‌లతో పాటు 2019 సంవత్సరం నుంచి అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న కంపెనీల వివరాలు, దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాలు, బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించారు.
పోలీసు శాఖ ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా పని చేయడం వెనుక ఉన్నది కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. దీంతో ఇప్పుడాయన పేరు రాజకీయవర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మార్మోగిపోతోంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేసే అధికారిగా ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.  
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.  రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు   అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా  చర్యలు తీసుకున్నారు. 
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన  బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో  తుఫాన్  ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి విదితమే.  ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.