ఏపీ పుర ఫలితాల్లో కూటమి హవా: వైసీపీ కుదేలు.!

Publish Date:Nov 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో  పురపాలక (మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తోంది.   రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87 మున్సిపాలిటీలకు నిర్వహించిన పోరులో కూటమి పక్షాలు ఏకపక్షంగా విజయం సాధించి పట్టణ ఓటర్లపై తమకున్న   పట్టును మరోసారి రుజువు చేసుకున్నాయి. మంగళవారం (నవంబర్ 3) ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే కూటమి అభ్యర్థుల ఆధిక్యత ఏకపక్షంగా సాగింది.

రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన అధికారిక ఫలితాల వివరాల ప్రకారం.. మొత్తం 87 మున్సిపాలిటీలలో ఎన్డీయే కూటమి ఏకంగా 63 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదు చేసింది.   తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 45 మున్సిపాలిటీలను గెలుచుకోగా, జనసేన   15 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధించాయి. మరోవైపు, వైసీపీ   5 మున్సిపాలిటీలకే పరిమితమై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఇతరులు   3 స్థానాలను దక్కించుకున్నారు.

 రాయలసీమతో పాటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని అనేక కీలక పురపాలక సంఘాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి 4,380 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడమే కాకుండా, ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేల్, ఎర్రగుంట్ల, పులివెందుల వంటి వైసీపీ కంచుకోటలుగా భావించే ప్రాంతాల్లోనూ కూటమి అభ్యర్థులు ముందంజ వేసి తమ సత్తా చాటారు.

గతంలో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన వైసీపీకి ఈ ఎన్నికల ఫలితాలు మింగుడుపడటంలేదు. మెజారిటీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిల పడ్డారు 

ఈ చారిత్రాత్మక విజయంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీయే కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాయి. పట్టణ ప్రజలు కూటమి సుపరిపాలనపై ఉంచిన నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనమని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని కూటమి ముఖ్య నాయకులు స్పష్టం చేశారు.  


[AP Municipal Election Results, TDP Janasena BJP Alliance Victory, AP Local Body Polls, YSCP Defeat,  Municipal Elections AP]

By
en-us Political News

  
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.
తుఫాన్‌ కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నందికొట్కూరులో బైరెడ్డి మార్క్ రాజకీయం.. వ్యూహం సక్సెస్.!
ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ప్రతి రౌండ్‌లోనూ ఓట్ల ఆధిక్యాన్ని పెంచుకుంటూ  , అంతిమంగా తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై   4 వేల 380 ఓట్ల భారీ మెజార్టీతో  విజయం సాధించారు.  
విచారణకు హాజరయ్యే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఆధారాలను తీసుకురావాలని ఈడీ అధికారులు తమ నోటీసుల్లో  పేర్కొన్నారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్‌లతో పాటు 2019 సంవత్సరం నుంచి అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న కంపెనీల వివరాలు, దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాలు, బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించారు.
పోలీసు శాఖ ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా పని చేయడం వెనుక ఉన్నది కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. దీంతో ఇప్పుడాయన పేరు రాజకీయవర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మార్మోగిపోతోంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేసే అధికారిగా ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.  
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.  రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు   అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా  చర్యలు తీసుకున్నారు. 
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన  బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో  తుఫాన్  ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి విదితమే.  ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.