పెడన మునిసిపల్ చైర్ పర్సన్ గా జనసేన అభ్యర్థిజ్యోత్స రాణి: 4 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం.!

Publish Date:Nov 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల   కూటమి స్పష్టమైన ఆధిక్యత చాటుతోంది.   ఓట్ల లెక్కింపు ప్రక్రియ  సాగుతున్న వేళ, కృష్ణాజిల్లాలోని కీలకమైన పెడన మున్సిపాలిటీలో జనసేన పార్టీ  తొలి విజయాన్ని నమోదు చేసింది. పెడన మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠానికి జరిగిన  పోరులో జనసేన  అభ్యర్థి జ్యోత్స్నరాణి విజయం సాధించారు. 

ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ప్రతి రౌండ్‌లోనూ ఓట్ల ఆధిక్యాన్ని పెంచుకుంటూ  , అంతిమంగా తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై   4 వేల 380 ఓట్ల భారీ మెజార్టీతో  విజయం సాధించారు.  

స్థానిక సంస్థల ఎన్నికల పొత్తు ఒప్పందంలో భాగంగా పెడన మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని కూటమి పక్షాలు జనసేనకి కేటాయించాయి. ఈ కేటాయింపునకు పూర్తి న్యాయం చేస్తూ జనసేన నాయకత్వం, శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాయి. తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జనసేన అభ్యర్థితో కలిసికట్టుగా పనిచేయడం, ఓటర్లలో నమ్మకాన్ని కలిగించడం ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించాయని పరిశీలకులు అంటున్నారు. 

ఈ విజయంతో పెడన పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల ఫలితం వెలువడగానే జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.  

[Pedana Municipal Election Results, Janasena Candidate Jyotsna Rani Win, Pedana Municipal Chairperson SeatAP Municipal Elections,  Alliance Victory, Telugu One] 

By
en-us Political News

  
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.
మొత్తం 87 మున్సిపాలిటీలలో ఎన్డీయే కూటమి ఏకంగా 63 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదు చేసింది.   తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 45 మున్సిపాలిటీలను గెలుచుకోగా, జనసేన   15 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధించాయి. మరోవైపు, వైసీపీ   5 మున్సిపాలిటీలకే పరిమితమై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఇతరులు   3 స్థానాలను దక్కించుకున్నారు.
తుఫాన్‌ కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నందికొట్కూరులో బైరెడ్డి మార్క్ రాజకీయం.. వ్యూహం సక్సెస్.!
విచారణకు హాజరయ్యే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఆధారాలను తీసుకురావాలని ఈడీ అధికారులు తమ నోటీసుల్లో  పేర్కొన్నారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్‌లతో పాటు 2019 సంవత్సరం నుంచి అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న కంపెనీల వివరాలు, దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాలు, బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించారు.
పోలీసు శాఖ ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా పని చేయడం వెనుక ఉన్నది కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. దీంతో ఇప్పుడాయన పేరు రాజకీయవర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మార్మోగిపోతోంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేసే అధికారిగా ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.  
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.  రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు   అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా  చర్యలు తీసుకున్నారు. 
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన  బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో  తుఫాన్  ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి విదితమే.  ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.