కేంద్ర మంత్రిగా డీకే అరుణ.. లీక్ ఇచ్చిన మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Publish Date:Jun 30, 2026

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక లీక్ ఇచ్చారు.  రాబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2029 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి వరుసగా నాలుగో సారి అధికారపగ్గాలు అందుకోవడమే లక్ష్యంగా మోడీ కేబినెట్ ను ప్రక్షాళన చేయనున్నారని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి విదితమే.   పార్లమెంట్  వర్షాకాలసమావేశాలకు ముందే మోడీ కేబినెట్  పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న జాతీయ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తోంది.  

ఈ నేపథ్యంలోనే తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో  డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ రాబిన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానో, యధాలాపంగానో వెల్లడించారు. 

ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  తెలంగాణ నుండి ఇద్దరు  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఒకరు క్యాబినెట్   జి. కిషన్ రెడ్డి కాగా, మరొకరు  బండి సంజయ్ కుమార్. రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా తెలంగాణ నుండి మరొకరికి కూడా  అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది.  సామాజిక సమతుల్యతను సాధించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు తెలంగాణ నుంచి మరో మంత్రికి అవకాశం ఇవ్వాలన్నది హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఈ తరుణంగా కిషన్ రెడ్డి డీకే అరుణ పేరు ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన సామాజికవర్గానికే చెందిన డీకే అరుణకు కేంద్ర కేబినెట్ లో స్థానం అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి.

కేబినెట్ బెర్త్ రేసులో ఎంపీ  ఈటల రాజేందర్,  ధర్మపురి అర్వింద్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం కేబినెట్ లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అందుకే కిషన్ రెడ్డి డీకే అరుణ పేరు ప్రస్తావించారని అంటున్నారు.  ఇక ఇదే సందర్భంగా బండి సంజయ్ భవితవ్వంపై కూడా రకరకాలుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

కుమారుడిపై పోక్సో కేసు నేపథ్యంలో బండి సంజయ్ కు కూడా కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి ఆయనకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనీ, అప్పుడు రాష్ట్రం నుంచి ముగ్గురికి కొత్తగా కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనీ అంటున్నారు. అప్పడు సామాజిక సమతుల్యాన్ని పాటించి అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైన వారికి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.  

By
en-us Political News

  
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.