కర్నాటకలో బీజేపీ నేత కిడ్నాప్..టీడీపీ ఎమ్మెల్యేపై కేసు.!

Publish Date:Sep 1, 2026

Advertisement

కార్నాటక రాజధాని బెంగళూరులో వ్యాపారవేత్త, నాయకుడి కిడ్నాప్ వ్యవహారంలో ఏపీకి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.బీజేపీ నాయకుడు, వ్యాపారవేత్త అయిన  రవిప్రకాష్ అపహరణ ఉదంతం తీవ్ర  ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారం  ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెడితే.. బాధితుడు  డాక్టర్ రవిప్రకాష్ బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పాటు బిజెపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనను శనివారం (ఆగస్టు29)  నాలుగు వాహనాల్లో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు  ఆయన భార్య సబీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.   ఆమె ఫిర్యాదు మేరకు  రంగంలోకి దిగిన  పోలీసులు   ప్రాథమిక ఆధారాల మేరకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్‌తో పాటు మరొకరిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. 

బెంగళూరు రాజరాజేశ్వరినగర్ ప్రాంతంలో ఉన్న  4 ఎకరాల స్థలానికి సంబంధించిన క్రయవిక్రయాలు, భూవివాదాలే ఈ కిడ్నాప్ కు కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు.    ఇలా ఉండగా   తనపై వస్తున్న ఆరోపణలను మైదుకూరు ఎమ్మెల్యే  ఖండించారు. తమకు ఈ స్థిరాస్తి తగాదాలతోనూ,  డాక్టర్ రవిప్రకాష్ కిడ్నాప్ తోనూ ఎటువంటి  సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.  చట్టపరమైన విచారణకు తాను అన్ని విధాలుగా సహకరిస్తామననీ, అనవసరంగా తమ పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని పుట్టాసుధాకర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.   అయితే డాక్టర్ రవిప్రకాశ్ కిడ్నాప్ జరిగిన  తీరుపై  పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు పోలీసులు ఈ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.  

ఇలా ఉండగా డాక్టర్ రవి ప్రకాష్ కిడ్నాప్ కు గురికాలేదనీ, ఒక కేసు విషయంలో మైదుకూరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారనీ అంటున్నారు. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల సరిహద్దు పరిధిలో చోటుచేసుకున్న ఈ  కిడ్నాప్  శాంతిభద్రతలపరంగా, రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు  జరిగింది  అరెస్టా లేక కిడ్నాపా అన్న విషయంలో మైదుకూరు పోలీసులు,   అంశంపై కర్ణాటక పోలీసులు స్పష్టతనివ్వాల్సి ఉంది.  


[Kidnap Case on Putta Sudhakar Yadav, , Bengaluru Police, BJP Leader Ravi Prakash,  Mydukur TDP MLA, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.