అవినీతి బురద కొద్దిగా వున్నప్పుడే… కడుక్కోవటం మంచిది!

Publish Date:Jun 1, 2017

Advertisement

కేంద్రంలో యూపీఏ పాలన పదేళ్లు, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పదేళ్లు కొనసాగాయి. తరువాత 2014లో ఏపీ, తెలంగాణ,  దిల్లీల్లో ప్రభుత్వాలు మారాయి. అయితే, మోదీ, చంద్రబాబు, కేసీఆర్ ఇంత వరకూ గర్వంగా చెప్పుకోగలిగింది అవినీతి రహిత పాలనే! ఆంధ్రాలో వైసీపీ బాబుగారి అవినీతి అంటూ గోల చేసినా ఇప్పటి వరకూ బలమైన ఆధారాలతో ఏ కేసులోనూ కార్నర్ చేయలేకపోయింది. ఇక మోదీ, కేసీఆర్ అయితే ప్రతిపక్షాలకి అవినీతి విషయంలో కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదు. వేరే వివాదాలు ఎన్ని తలెత్తినా అవినీతి, కుంభకోణాలు మాత్రం అటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఇటు గులాబీ సర్కార్ ని ఇబ్బంది పెట్టలేదు. కాని, తాజాగా బయటపడ్డ మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణం… టీఆర్ఎస్ ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా కనిపిస్తోంది…

 

ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పద్ధతిని ఆసరా చేసుకుని సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారులు చేతి వాటం చూపిన సంగతి కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. కోట్లు ఖరీదు చేసే నగరంలోని భూములు ఆక్రమార్కుల చేతికి చిక్కాయి. ఇప్పుడు కేసీఆర్ గట్టి చర్యలు తీసుకుని జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మీడియాలో వస్తున్న కథనాలు ఆయన సర్కార్ ప్రతిష్ఠ దిగజార్చేలా వున్నాయి. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే తొలి తెలంగాణ ప్రభుత్వంపై వున్న పారదర్శకమైన అభిప్రాయం బలహీనపడే అవకాశం వుంది.

 

మియాపూర్ లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు గోల్ మాల్ చేశారు అధికారులు. అయితే, ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్న టాక్ ప్రకారం కేసీఆర్ క్యాబినేట్లోని ఒక సీనియర్ మంత్రి ఈ కుంభకోణానికి సహకరించారట! ఆయన పేరు, ఆయన శాఖ గురించి మీడియా చెప్పకున్నా…. చాలా బలమైన ఆధారాలే లభించాయట ఆయన ఇన్వాల్వ్ మెంట్ గురించి. అసలు మియాపూర్ భూముల గోల్ మాల్ లో తొలి లబ్ధిదారుడు ఆయనే అంటోంది మీడియా. 50కోట్లు విలువ చేసే భూమి మంత్రి ఫ్రీగా కాజేశారట.

 

కేసీఆర్ క్యాబినేట్లో ఒక సీనియర్ మంత్రి స్వయంగా ప్రొత్సహించి మియాపూర్ భూముల అక్రమాలు నడిపించారనేది మామూలు ఆరోపణ కాదు. అందులో నిజం వున్నా లేకున్నా సీఎం వెంటనే ఆ మంత్రి ఎవరో నిర్ధారించుకుని చర్యలు తీసుకుంటే బావుంటుంది. అసలు అవినీతి జరగకపోతే చాలా బావుండేది. కాని, తప్పు జరిగిందని ఆల్రెడీ అర్థమవుతోంది. ఇక అందులో మంత్రి హస్తం వుందని వార్తలు రావటం జనంలోకి తప్పుడు సంకేతాలు పంపుతాయి. అందుకే, కేసీఆర్ సదరు మంత్రి ఎవరో తెలుసుకుని వేటు వేస్తే నైతికంగా వుంటుంది. ఆయన తప్పేం లేదని భవిష్యత్ లో తేలితే తిరిగి పదవి ఇవ్వవచ్చు. గతంలో సీఎం మంత్రి రాజయ్యను కఠిన వైఖరి అవలంబి తొలగించారు. ఇప్పుడూ అలాగే చేస్తే ఆయనపై జనంలో నమ్మకం పెరుగుతుంది! లేదంటే, ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారే అవకాశం లేకపోలేదు. ఈ మధ్యే జింకల వేట విషయంలో కూడా ఓ మంత్రి పేరు పదే పదే పరోక్షంగా వినిపిస్తూ వచ్చింది…

By
en-us Political News

  
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.