విధులకు వెళ్లకుండానే నెలకు రూ.70 వేల జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యే మేనకోడలు..!

Publish Date:Sep 16, 2026

Advertisement

కర్ణాటక రాజకీయ వర్గాలలోనూ, వైద్య రంగంలోనూ ప్రస్తుతం ఒక విచిత్రమైన ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యురాలిగా నియమితులైన ఓ యువతి, అసలు విధులకు హాజరుకాకుండానే ప్రతి నెలా భారీ మొత్తంలో వేతనం అందుకున్న వైనం వెలుగులోకి వచ్చింది.

బాగల్‌కోట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమ మేటి మేనకోడలైన డాక్టర్ అంకిత యారగల్ ఈ వివాదంలో ప్రధాన ముఖంగా నిలిచారు. బాగల్‌కోట్‌లోని వాంబే కాలనీలో గల ప్రభుత్వ అనుబంధ ‘నమ్మ క్లినిక్’లో ఆమెను మెడికల్ ఆఫీసర్‌గా నియమించారు. అయితే ఆమె ఆ పదవిలో ఉంటూనే మరోవైపు ప్రైవేట్ వైద్య కళాశాలలో పీజీ (ఎండీ) కోర్సులో చేరినట్లు విచారణలో తేలింది.

గత మార్చి నెల నుంచి ఆమె ఆ క్లినిక్ ముఖమే చూడలేదని స్థానికులు, రోగుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. క్లినిక్‌లో డాక్టర్ లేకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కనీసం నర్సులే మందులు ఇవ్వాల్సి వస్తోందని సమాచారం అందింది. అయినప్పటికీ ఆమెకు ప్రతి నెలా రూ. 70 వేలకు పైగా వేతనం ఎలాంటి ఆటంకం లేకుండా ఖాతాలో జరిగిపోవడం విస్మయానికి గురిచేసింది.

ఈ వ్యవహారంపై స్థానిక పంచాయతీ యంత్రాంగం సీరియస్‌గా స్పందించింది. బాగల్‌కోట్ జిల్లా పంచాయతీ సీఈవో గజానన్ బాలే రంగంలోకి దిగి సంబంధిత డాక్టర్‌కు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. అనధికారిక ద్వంద్వ నియామకం, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తొలి విచారణకు ఆమె గైర్హాజరు కావడంతో, సెప్టెంబర్ 18న జరిగే తదుపరి విచారణకు కచ్చితంగా హాజరుకావాలని స్పష్టం చేశారు.

మరోవైపు ఈ కుంభకోణంలో ఆమె తండ్రి, జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్‌వో) పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీహెచ్‌వో రాజ్‌కుమార్ యారగల్ తన కూతురిని వివాదం ముదరడంతో విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తన కుమార్తె ఎండీ కోర్సులో చేరినప్పటి నుంచి జీతం తీసుకోలేదని ఆయన వాదిస్తున్నారు.

ఇలాంటి అనధికారిక డ్యూటీల ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. తదుపరి విచారణకు గైర్హాజరైతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని, ఇప్పటివరకు చెల్లించిన వేతనాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కర్ణాటక మెడికల్ కౌన్సిల్ అలాగే నేషనల్ మెడికల్ కమిషన్ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

[ Karnataka MLA niece scam, Dr Ankita Yaragal Namma Clinic, Bagalkot medical officer salary controversy, Umesh Meti niece news, ghost employee government doctor Karnataka, Telugu News, Telugu One ]


 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.