కరుణా, జయ, శశికళ... ముచ్చటగా మూడో నియంత!

Publish Date:Feb 6, 2017

Advertisement

సోషల్ మీడియాలో ఒక సెటైర్ భలే హుషారుగా చక్కర్లు కొడుతోంది! అదేంటంటే, సిటీ బస్సులో లేడీస్ రిజర్వ్ర్డ్ సీట్ లాంటి తమిళ సీఎం కుర్చీలో కూర్చున్న పన్నీర్ సెల్వం.... శశికళ రాగానే ''కూర్చోండి మేడమ్'' అంటూ పక్కకు తప్పుకున్నారట! ఇంతకు ముందు కూడా ఆయన జయలలిత తప్పుకోగానే కూర్చోటం, మళ్లీ ఆమె రాగానే గౌరవంగా పాదాభివందనం చేసి సీటు ఇచ్చేయటం మనకు తెలిసిందే! అందుకే, ఈ లేడీస్ సీట్ సెటైర్ రన్ అవుతోంది!  

 


తమిళనాడు సీఎం సీటు లేడీస్ కి రిజర్వ్డ్ కాకపోవచ్చుగాని... నెక్స్ట్ చెన్నై క్వీన్ శశికళనే అని ఇప్పటికే రూఢీ అయిపోయింది. పన్నీర్ సెల్వం మరో సారి సెలవు పుచ్చుకుని ముఖ్యమంత్రి నుంచి మామూలు మంత్రి అయిపోయారు. ఇదే పరిస్థితి వేరే రాష్ట్రంలో అయితే పెద్ద రచ్చే అయ్యేది. ఉదాహరణకి బీహార్లో ఆ మధ్య జరిగింది గుర్తుందిగా? నితీష్ కుమార్ తాత్కాలికంగా పీఠం ఎక్కించిన మాంజీ ఏకు మేకయ్యాడు తరువాతి కాలంలో. నానా రభస జరిగింది. కాని, పన్నీర్ సెల్వం అలాంటి పేచీలు ఏమీ పెట్టకుండా అప్పట్లో జయ కోసం, ఇప్పుడు శశికళ కోసం అధికారాన్ని తృణప్రాయంగా వదిలేస్తూ వస్తున్నాడు. అది ఆయన గొప్పతనం అని కూడా చెప్పటానికి లేదు. ఎందుకంటే, ఆయన ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకుని వుందామన్నా అన్నాడీఎంకేలో ఆయన వెంట గట్టిగా నిలిచే ఎమ్మేల్యేలు దాదాపు లేరనే చెప్పాలి. అప్పుడు జయమ్మ అన్న వారు ఇప్పుడు చిన్నమ్మ అంటున్నారు. రాజకీయ అనుభవం, దక్షత, ప్రజల మద్దతు ఇలాంటివేవీ అన్నాడీఎంకే శాసన సభ్యులు పట్టించుకున్నట్టు లేదు. కేవలం చిన్నమ్మ పట్ల విధేయత మాత్రమే కనిపిస్తోంది. జనం తమకు ఓట్లు వేసేప్పుడు శశికళను చూసి వేశారా... అన్న చిన్న ఆలోచన కూడా వారికి రావటం లేదు!

 


అసలు తమిళనాడులో గడిచిన కొన్ని దశాబ్దాలుగా కొనసాగిన నియంతృత్వమే ఇవాళ్లీ ఈ పరిస్థితికి కారణం! అన్నాడీఎంకేలో జయలలితది ఉక్కు పిడికిలి. ఆమె తనకు విధేయంగా వున్నంత సేపూ అమ్మలానే వుండేది. కాని, ఎవరైనా సరే తనకు కొంచెం ఎదురుతిరిగినా జేజేమ్మఅయిపోయేది. అందుకే, కరుణానిధి మొదలు వైగో వరకూ అందరు గజగజలాడేవారు. రజినీకాంత్ మొదలు విజయ్ కాంత్, వడివేలు వరకూ అంతా విలవిలలాడేవారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా తమిళనాడులో ధైర్యంగా అమ్మకు ఎదురేగి నిలిచిన వారు ఎవ్వరూ లేరు. పార్టీ బయటే ఇలా వుంటే లోపల ఎలా వుంటుంది? మనకి ఒక్క పన్నీర్ సెల్వమ్ మాత్రమే తెలుసు. కాని, ఏఐఏడీఎంకేలో అందరికందరూ పన్నీరు డబ్బాలే! ఎవ్వరూ అప్పుడు జయకి, ఇప్పుడు శశికి ఎదురు తిరిగేవారు కాదు. తమిళ ఓటర్ల కన్నా వారికి పార్టీ అధినేత్రులే ముఖ్యం!

 

 


జయలలిత పార్టీనే కాదు కరుణానిధి పార్టీ కూడా తమిళనాడులో కర్కశత్వానికి పెట్టింది పేరు. కరుణ నీడలో ఆ పార్టీలో ఒక్కడంటే ఒక్కడు కూడా బలమైన నేతగా ఎదగలేదు! కరుణానిధి తన కుటుంబ సభ్యుల్ని తప్ప మరెవర్నీ కరుణించలేదు. పోనీ తన పిల్లల్నైనా పాప్యులర్ నేతలుగా మార్చాడా అంటే అదీ లేదు. స్టాలిన్ తో సహా ఆయన వారసులెవరూ సీఎం రేంజ్ అభ్యర్థులు కారు! డీఎంకేలోని మిగతా నేతల మాటైతే మాట్లాడుకోవటమే దండగ! కరుణానిధి బొమ్మ లేకుండా జనంలోకి వాళ్లు వెళితే పట్టించుకునే వాడే వుండనీ పరిస్థితి... 

 

 


జయ, కరుణానిధి డిక్టేర్‌షిప్‌లు ఇప్పుడు దాదాపు అంతమైనట్టే. అమ్మ లేనేలేదు. తాతగారు మంచంపట్టారు. కనీసం ఇప్పుడైనా తమిళులకి దమ్మున్న నాయకత్వం లభిస్తుందా అంటే అలాంటి సూచనలేం కనిపించటం లేదు. శశికళ సీఎం కుర్చీ ఎక్కేస్తోంది కాని ఆమె మున్ముందు ఎంత వరకూ జనం మద్దతు సంపాదించుకుంటారో డౌటే! ఆమె ఇప్పటి వరకూ జయలలిత చెలికత్తెగా కొనసాగటం తప్ప సాధించింది ఏమీ లేదు. అలాగే, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా ప్రజల్లో ఆమోదం సంపాదించటం కష్టమే. ఎందుకంటే, ఆమెకు అమ్మతో రిలేషన్ షిప్ తప్ప ఇంకేం క్వాలిఫికేషన్ లేదు. మీడియా వారి హడావిడి తప్ప దీపాను జనం పట్టించుకుంటారనుకోవటం అత్యాశే! ఇక మిగిలింది రాజకీయాలంటే ఇష్టమో, కష్టమో తేల్చని రజినీకాంత్!

 


తలైవా తన  సినిమాల్లో ఎంతో ధైర్యంగా , ముక్కు సూటిగా మాట్లాడతాడు! కాని, నిజ జీవితంలోకి వచ్చే సరికి పాలిటిక్స్ గురించి ప్రతీసారీ డొంక తిరుగుడే! ఈ మధ్య మరోసారి తనకు పవర్ అంటే ఇష్టమే అంటూ కలకలం రేపాడు. అంతా హాహాకారాలు చేశాక... అబ్బే నేను చెప్పిన ఆధ్యాత్మిక శక్తి అంటూ వివరణ ఇచ్చాడు! అదేదో ముందే చెప్పొచ్చుగా? పొలిటికల్ ఎంట్రీ విషయంలో రజినీది ఎప్పట్నుంచో ఇదే దారి! అనుమానం, అయోమయం తప్ప మరేం వుండదు ఆయన స్ట్రాటజీలో!

 


పన్నీర్ సెల్వం, స్టాలిన్, దీపా జయకుమార్, రజినీకాంత్... ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా తమిళనాడుకు బలమైన సీఎం ఇప్పుడప్పుడే దొరకటం కష్టం. ఇక జనం మద్దతుతో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ వున్న మాస్ లీడర్ లభించటం ఇంకా కష్టం. కాబట్టే, అందరిలోకి తన ఎమ్మేల్యేలపై కాస్త పట్టున్న చిన్నమ్మ వేగంగా ముందుకు దూసుకువస్తోంది. ఆమె జయ, కరుణానిధి లాగా పాతుకుపోతే... మరో నియంతృత్వానికి బీజాలు పడ్డట్టే! 

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.