జగన్ ఫ్రస్ట్రేషన్ లో బ్యాలెన్స్ తప్పేశారా?

Publish Date:Jul 15, 2026

Advertisement

తప్పు ఒప్పు లేదు.. ఉచ్ఛం, నీచం లేదు... చట్టం, రాజ్యాంగం పట్టదు.. పాపం పుణ్యం అసలే లేదు. కావలసింది ఒక్కటే మరోసారి అధికారం దక్కించుకోవడం. అందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కనీ అంతిమ లక్ష్యం అధికారమే. మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి   ఎంతకైనా సిద్దపడుతున్నారు. 2019 గత ఎన్నికలలో బాబాయ్ హత్య, కోడికత్తి లాంటి ఎన్నో డ్రామాలను రక్తి కట్టించిన జగన్ కు 2024 ఎన్నికలలో గులకరాయి వంటి ఎత్తుగడలు వికటించాయి. ఇక ఇప్పుడు 2029 ఎన్నికలలో విజయంపై జగన్ కుఇప్పటి నుంచే భయాలు పట్టుకున్నాయి. 

ఆ భయంతోనే జగన్ లో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఆయన తాజాగా విశాఖ పట్నం పర్యటనలో మాట్లాడిన మాటలనే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  సరే సముద్రంలో బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి.. తాను అధికారంలోకి రాగానే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చేశారు. అక్కడితో ఆగకుండా.. బోటు ప్రమాదానికీ, ఆ ప్రమాదంలో మత్స్యకారులు మరణించడానికి చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం, నిర్వాకమే కారణమంటూ విమర్శలు గుప్పించేశారు. సాధారణంగా జగన్ ప్రభుత్వంపై చేసే విమర్శలన్నీ ఆవు కథలాగే ఉంటాయి. అవి పక్కన పెడితే..

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.  బైక్ యాక్సిడెంట్ చేసి ఓ నిరుపేద వ్యక్తి మరణానికి కారణమవ్వడమే కాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అసలు సంబంధం లేని మరో యువకుడిని నిందితుడిగా ఇరికించే ప్రయత్నం చేసి... ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాతే నిందితుడు సిదిరి అప్పలరాజు కుమారుడు పోలీసులకు లొంగిపోయాడు.  అటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ..  18 ఏళ్ల పిల్లోడిపై కేసు పెట్టడం తప్పు అన్నట్లుగా జగన్ మాట్లాడటం రాజకీయ పరిశీలకులనే కాదు, సామాన్య జనాలను కూడా విస్మయపరుస్తోంది. 

ఈ కేసులో నిందితుడిని వెనకేసుకురావడం ద్వారా చట్టం ముందు అందరూ సమానులే అనే ప్రాథమిక సూత్రాన్ని జగన్ రెడ్డి విస్మరించారు.   నిందితుడు తమ పార్టీ నేత కుమారుడైనందున..  ఈ ప్రమాదంలో చనిపోయిన ఒ గొర్రెల కాపరి ప్రాణానికి అసలు విలేవే లేదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తికి చట్టాలపై కనీస అవగాహన లేకపోవడం, లేదా తెలిసి కూడా తప్పుడు కేసులను సమర్థించడం చూస్తుంటే ఆయన  మైండ్ సెట్ ఎలాంటిదో అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయంటున్నారు.  

Sidiri Appalaraju, Son, Accident, Defend

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.