జయ, శశికళకి తప్పని కోర్టు గండం... జగన్ కి తప్పుతుందా?

Publish Date:Feb 11, 2017

Advertisement


 
ఆ మధ్య ప్రత్యేక హోదా కోసం వైజాగ్ బీచ్ లో ఉద్యమం అంటే జగన్ రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయారు! కాని, పోలీసులు అడ్డుకోవటంతో ఆగ్రహంతో ఊగిపోయారు! అప్పుడు ఏమన్నారు? నెక్స్ట్ సీఎం నేనే... అందర్నీ గుర్తుపెట్టుకుంటా అని హెచ్చరించారు! కాని, పరిస్థితి చూస్తుంటే జగన్ ఎంత మంది పోలీసు అధికారుల్ని గట్టిగా గుర్తు పెట్టుకున్నా ఆయన సీఎం అవ్వటం అనుమానంగానే కనిపిస్తోంది. అందుకు కారణం... ప్రస్తుతం తమిళనాడు సీఎం అవ్వాలని శాయశక్తులా ప్రయత్నిస్తోన్న శశికళ పరిస్థితే!

 

జయతో పాటూ ముప్పై ఏళ్ల జీవితం పంచుకున్న శశి ఆమెపై పడ్డ అవినీతి మచ్చని కూడా పంచుకుంది! అక్రమాస్తుల కేసులో ఏ2గా సుప్రీమ్ కోర్టుదాకా వెళ్లింది. ఇప్పుడు ఆ కేసులో తీర్పే కొంప ముంచేలా వుంది. ఎమ్మెల్యేల మద్దతు వున్నా శశికళ సీఎం అవ్వలేకపోవటానికి కారణం అవినీతి ఆరోపణలే! ఇక మన రాష్ట్రంలో ఈడీ దూకుడు చూస్తుంటే కూడా జగన్ పరిస్థితి శశికళ లాగే అనిపిస్తోంది! ఆమెకి, మన యువనేతకి సంబంధం ఏంటి అంటారా? అవినీతి మరకలే!

 

మొన్నటికి మొన్న 9వందల సరస్వతీ సిమెంట్స్ భూముల్ని ఈడీ అటాచ్ చేసింది. వైసీపీ అధినేత ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైద్రాబాద్ ఆస్తులపై కూడా దృష్టి పెట్టింది. ఏకంగా లోటస్ పాండ్ లోని ఆయన నివాసంపైనే పంజా విసరబోతోంది. అలాగే, జగన్ మీడియాకు కేంద్రమైన సాక్షి టీవీ, పేపర్ల భవనాల్ని కూడా ఈడీ స్వాధీనం చేసుకోబోతోంది! ఇంకా కొన్ని ఇతర ఆస్తులకి ఈడీ నుంచి మూడినట్టే కనిపిస్తోంది!

 

జగన్ కు చట్టపరమైన కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు. కోర్టులో కేసులు ఒకవైపు సతమతం చేస్తోంటే మరో వైపు నుంచి ఈడీ తరుముకొస్తోంది. జగన్ ఆస్తుల్ని అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఈడీ అటాచ్ చేయటం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ చేసింది. అయితే, హైకోర్ట్ కు వెళ్లి ఆయన స్టే తెచ్చుకున్నారు. కాని, ఇప్పుడు స్టే ఎత్తివేయటంతో అటాచ్ మెంట్ల భూకంపం కుదిపేస్తోంది. పైకి గంభీరంగానే కనిపిస్తున్నా జగన్ శిబిరంలో టెన్షన్ బాగానే వుంది. కేవలం పది రోజులు టైం ఇచ్చిన ఈడీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవటం కష్టంగా మార్చేసింది. సాధారణంగా 45 రోజులు గడువు ఇవ్వాలి. కాని, జగన్ పై అభియోగాలు తీవ్రంగా వుండటంతో పది రోజులే అవకాశం ఇచ్చింది ఈడీ. ఇప్పుడు పది రోజుల్లో ప్రతిపక్ష నేత సుప్రీమ్ దాకా వెళ్లైనా ఆస్తుల్ని కాపాడుకోవాలి. లేదంటే తీర్పు వచ్చే వరకూ ఆయన ఆయా ఆస్తుల పై ఆశలు వదులుకుని మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది!

 

జయ, శశికళ అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంది కేవలం అరవై ఆరు కోట్లకు సంబంధించే. అయినా పురుచ్చితలైవీ సీఎం పదవి వదులుకోవాల్సి వచ్చింది. శశికళ సీఎం కుర్చీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతోంది! మరి జగన్ అంతకు పది రెట్లు ఎక్కువ మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టారని కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మరి ఈ చట్టపరమైన కందకాలు దాటుకుని .... సీఎం అవుతానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్న జగన్ ఎప్పుడు అమరావతి సింహాసనం అధిష్ఠిస్తాడో... చూడాలి మరి!

By
en-us Political News

  
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.