జగన్-రామోజీ భేటీ వెనుక అసలు రహస్యం? ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్

Publish Date:Sep 26, 2015

Advertisement

ఒకపక్క జగన్ దీక్ష హడావిడి, మరోపక్క అనుమతి లేదన్న ప్రకటనలు, వీటన్నింటితో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంటే, ఇవేమీ పట్టనట్టు ఏదో కొంపులు మునిగిపోతున్నట్టుగా అంత ఆర్జెంట్ గా ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ రామోజీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలవాల్సి వచ్చింది? అసలేం జరిగింది?. తన తండ్రి వైఎస్ హయాం నుంచీ బద్ధశత్రువైన రామోజీ కాళ్ల దగ్గరకు జగన్ పరుగెత్తుకుని వెళ్లాల్సిన అంత కష్టం ఏమొచ్చింది? చదవండి ఎక్స్ క్లూజివ్ స్టోరీ

వైఎస్ తో పోల్చితే జగన్ చాలా మొండివాడని అంటారు, ఎవరినీ లెక్కచేయని నైజం, మోనార్క్ అంటుంటారు, అందుకే కష్టాలు తప్పవని తెలిసి కూడా సోనియాగాంధీని ఎదిరించి జైలుపాలయ్యాడని చెబుతారు, జగన్ మొండి వైఖరి వల్లే 2014 ఎన్నికల్లో చేతిదాకా వచ్చిన అధికారం అందకుండా పోయిందని, పైగా తన వద్దకు వచ్చిన వారెందరినో కాదనుకున్నాడని, అతని బీహేయర్ నచ్చకే మరికొందరు  పార్టీకి గుడ్ బై చెప్పారని, ఇవన్నీ కలిసి వైసీపీ ఓటమికి దారితీశాయని విశ్లేషిస్తారు. అయితే ఇంత మొండిగా మోనార్క్ లా వ్యవహరించే నైజమున్న జగన్ కు తట్టుకోలేని ఆపదేమో ముంచుకొచ్చిందని, అందుకే ఆగమేఘాల మీద రామోజీని కలిశాడని అంటున్నారు. తనకు జరగకూడని నష్టమేదో జరగబోతుందని తెలియడం వల్లే రామోజీ కాళ్ల దగ్గరకు పరుగెత్తుకుని వెళ్లాడని చెబుతున్నారు.


వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా కచ్చితమైన ఆధారాలతో ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ‘ఈనాడు‘లో ప్రచురించడానికి రంగంసిద్ధమైందట, ఈ కథనాలు తన తలరాతను, పార్టీ భవిష్యత్ ను మార్చేవిగా ఉన్నాయని ఉప్పందుకున్న జగన్మోహన్ రెడ్డి...అవి రాకుండా చేసుకునేందుకే రామోజీని కలిశారని విశ్వసనీయ సమాచారం. వాటిలో ఒకటి పార్టీకి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కూడా ఉందట, ‘వైసీపీ చాప చుట్టేయబోతుందా‘ అనే పేరుతో ప్రచురించడానికి రెడీ అయిన ఆ ఆర్టికల్ ప్రకారం 40మందికి పైగా ఎమ్మెల్యేలు
తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్లతో సహా రాసుకొచ్చిందట, ఇలాంటి కథనం ఈనాడులో వస్తే పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో ఊహించిన జగన్ ...హడావిడిగా రామోజీని కలిశారని టాక్. గతంలో వైసీపీని బీజేపీలో విలీనం చేస్తారంటూ వచ్చిన కథనం లాంటిదని సమాచారం.

గతంలో ‘జెండా పీకేస్తారు‘ అంటూ చిరంజీవి ప్రజారాజ్యంపై ఈనాడులో వచ్చిన కథనం ఎంత సంచలనం అయ్యిందో, ఆ తర్వాత పీఆర్పీ... కాంగ్రెస్ లో ఏవిధంగా విలీనమైందో తెలిసిన జగన్, అలాంటి కథనాలు రాకుండా చూసుకోవడం కోసమే రామోజీ కాళ్ల దగ్గరకు వెళ్లాడని అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.