జగన్ తీరు.. వైసీపీ బేజారు.!

Publish Date:Aug 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయ్యింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం  కూటమి సమన్వయంతో  ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు, శ్రేణుల మధ్య ఏవైనా ఇబ్బందులూ, విభేదాలూ పొడసూపినా.. అగ్రనాయకత్వం జాప్యం లేకుండా జోక్యం చేసుకుని, అవి మరింత ముదరకుండా చర్యలు తీసుకుంటోంది. మరో వైపు 2024 ఎన్నికలలో 11 సీట్లకే పరిమితమైన ఘోర పరాజయం పాలైన వైసీపీ ఈ రెండేళ్లలోనూ ఇసుమంతైనా కోలుకున్నట్లు కనిపించదు. 

అందుకు ప్రధాన కారణం.. ప్రజలు తిరస్కరించినా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా, ఆ హోదా కోసం నానాయాగీ చేస్తూ, మంకుపట్టుపట్టి ప్రజల దృష్టిలో మరింత చులకల అయ్యింది. ప్రతిపక్ష హోదా కోసం అభ్యర్థించడం, డిమాండ్ చేయడం, చివరకు కోర్టుకు కూడా వెళ్లి జగన్ వృధా ప్రయత్నాలు చేశారు. చివరకు విపక్ష హోదా కోసం అలిగి అసెంబ్లీ బాయ్ కాట్ చేశారు. ఈ రెండేళ్ల కాలంలో జగన్ రెండు మూడు సార్లు వినా అసెంబ్లీకి వెళ్లింది లేదు. జగన్ మాత్రమే కాదు.. ఆయనతో సహా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీ ముఖం చూడటం లేదు.  కేవలం అహంభావంతో ఆయన విపక్ష హోదా కోసం పట్టుబట్టి అసెంబ్లీకి ముఖం చాటేసి పార్టీకి మరింత నష్టం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏం చేసినా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా, వైపీ ప్రతిపక్ష పార్టీ గుర్తింపు దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవని విస్పష్టంగా చెబుతున్నారు. ఇక వైసీపీలో విషయ జ్ణానం ఉన్న వారందరికీ కూడా ఈ వ ిషయం తెలిసినప్పటికీ ఆ సంగతిని జగన్ కు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. అంతెందుకు  జగన్   మద్దతు దారు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విపక్ష హోదా కోసం జగన్ తాపత్రేయపడటం శుద్ధ వేస్టని కుండబద్దలు కొట్టేశారు కూడా.  ఎంత పాకులాడినా ఆయనకు విపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదనీ, ఆ విషయంలో జగన్ చేస్తున్నదంతా వృధా ప్రయాసేనని గతంలోనే  కుండబద్దలు కొట్టేశారు.

రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు.  అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి  ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు. ఆయన తీరు ఇలాగే ఉంటే.. రాష్ట్రంలో పార్టీ ఉనికి  మాత్రంగా మిగిలే అవకాశం కూడా ఉండదనీ,  ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుందని అంటున్నారు.  తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కనుకే తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నా..   సీఎంగా చక్రం తిప్పిన అసెంబ్లీలో ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవడానికి జగన్ కు అహం అడ్డొస్తోందనీ, ఆ కారణంగానే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమౌతోంది. .  

ఇక ప్రస్తుతానికి వస్తే..రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయి రెండేళ్లయ్యింది. ఈ రెండేళ్లలో జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు. బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమై ఏదో చుట్టపు చూపుగా ఏపీకి వస్తున్నారు. అలా వచ్చి కూడా ప్రెస్ మీట్ లకే పరిమితమై ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. అధవా బయటకు వచ్చినా.. పరామర్శ యాత్రల పేర బల ప్రదర్శన చేస్తున్నారు. ఆయన బయటకు వచ్చిన ప్రతి సారి ఏదో ఒక సమస్యతో పార్టీ, శ్రేణులూ చిక్కుల్లో పడుతున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమౌతోంది.  

అయినా..   పార్టీ నాయకులు   బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించమని జగన్ అప్పుడప్పుడు పిలుపునిస్తున్నారు. అయితే సమస్య ఏంటంటే.. జగన్ స్వయంగా పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలలో ఆయన పాల్గొనరు. దీంతో వైసీపీ నిరసనలు తూతూమంత్రంగానే మిగిలిపోతున్నాయి. జగన్ క్షేత్రస్థాయిలోకి రాకుండా ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు దాదాపు మృగ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికైనా అంటే ఘోర  పరాజయానికి రెండేళ్లు పూర్తయిన తరువాతైనా వాస్తవం గ్రహించి అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారేమో అన్ని చిన్న ఆశ ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో నిన్నమొన్నటి వరకూ ఉండేది. కానీ సోమవారం (ఆగస్టు 10) నుంచి ఆరంభమైన అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడంతో ఆ ఆశ కూడా అడుగంటి పోయింది.  క్షేత్రస్థాయిలోనూ, అసెంబ్లీలోనూ జగన్ లేకపోవడంతో..  ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో పట్టు కోల్పోయింది. జగన్ ఇప్పటికైనా వాస్తవం గ్రహించి తీరు మార్చుకోకుంటే.. తమ రాజకీయ భవిష్యత ఏమిటి? అన్న బెంగ వైసీపీయులలో కనిపిస్తోంది.  

Jagan, AP Assembly Sessions, YCP, Jagan Assembly Attendance, AP Politics, Teluguone

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.