తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కు బిజెపి మద్దతు లభించింది. ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరామ్ కు టి.ఆర్,ఎస్, అధినేత కేసీఆర్ కు మధ్య ప్రచ్చన్నయుద్ధం జరుగుతోంది. ప్రొఫెసర్ కోదండరామ్ ను జె.ఎ.సి. చైర్మన్ పదవి నుంచి తప్పించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ తన మాట వినకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అక్కసును కేసీఆర్ వెళ్లగక్కుతున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీని తానే ఏర్పాటు చేశానని, కోదండరామ్ ను కూడా తానే నియమించానని, ఇప్పుడు కోదండరామ్ తననే దిక్కరిస్తున్నరనే భావనతో కేసీఆర్ ఉన్నారు. అయితే కేసీఆర్ వైఖరిని బిజెపి నాయకులు తప్పుపడుతున్నారు.
జె.ఎ.సి. నుంచి కోదండరామ్ ను తొలగించే ప్రయత్నాలు మానుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణా జె.ఎ.సి. టి.ఆర్.ఎస్. ఏర్పాటు చేయలేదని, జె.ఎ.సి. టి.ఆర్.ఎస్. కు జేబు సంస్థ కాదని ఆయన అన్నారు. సకలజనుల సమ్మె ఉధృతంగా సాగుతున్న సమయంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి సమ్మెను నీరుగార్చారని ఆయన విమర్శించారు. ఈ విషయమై కేసీఆర్ ను నిలదీసినందుకే కోదండరామ్ ను తప్పించాలని ప్రయత్నిస్తున్నారని రామకృష్ణారెడ్డి అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jac-committee-chairman-prof-kodandaram-24-13868.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!