వరంగల్ జిల్లా పరకాల శాసనసభ ఉప ఎన్నిక టి.ఆర్.ఎస్.కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించకపొతే తెలంగాణా సెంటిమెంటు బలహీనపడుతుందనే భయాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. గతనెలలో జరిగిన ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. అభ్యర్థులు తమ స్థానాలను నిపుకోగలిగారు. కానీ, పరకాలలో తాజామాజీ అయిన కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకుని తెలంగాణా సత్తా చాటాలని టి.ఆర్.ఎస్. భావిస్తోంది.
కానీ పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయి. పరకాలలో టి.ఆర్.ఎస్.తో పాటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేయబోతున్నారు. దీనికి తోడు కోదండరామ్ నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీకి, టి.ఆర్.ఎస్. కు మధ్యన ప్రచ్చన్నయుద్ధం సాగుతోంది. జె.ఎ.సి. ఇటీవలి మెహబూబ్ నగర ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోవడంతో అక్కడ టి.ఆర్.ఎస్. పరాజయం పాలైంది. ఈ సారి కూడా జె.ఎ.సి. మద్దతు టి.ఆర్.ఎస్. కు లభించేలా కనిపించటం లేదు. ఒకవైపు టిడిపి, బిజెపి వల్ల తెలంగాణవాద ఓట్లలో చీలిక, మరోవైపు జె.ఎ.సి. మద్దతు లేకపోవటం టి.ఆర్.ఎస్. నాయకులను కలవరపెడుతోంది. దీనికి తోడు తాజా మాజీ కొండా సురేఖ కూడా ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తున్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/parakala-constituency-of-warangal-district-bypolls-24-13869.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.