చంద్రబాబు నెత్తిన పాలు పోసిన వైఎస్ జగన్!!

Publish Date:Jan 10, 2020

Advertisement

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ దూకుడు ముందు నిలబడలేక టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఇది మామూలు ఓటమి కాదు. టీడీపీ పునాదులనే కదిలించిన ఓటమి. అసలు ఈ ఓటమి నుండి టీడీపీ ఇప్పట్లో కోలుకుంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ క్యాడర్ లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. మరోవైపు వైసీపీ ఘన విజయంతో ఆ పార్టీ నాయకత్వం, కేడర్ నూతనోత్సాహంతో పరుగులు పెట్టింది. 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ జోరు చూసి.. వైఎస్ జగన్ కి ఇక తిరుగులేదు అనుకున్నారంతా. ప్రజలు రికార్డు మెజారిటీ ఇచ్చారు.. ఇక ఇతర పార్టీ నేతలను ఆకట్టుకోవాల్సిన పనికూడా లేదు. జగన్ కూల్ గా తనపని తాను చేసుకుంటూ పొతే చాలు.. వచ్చే ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచి సీఎం అయిపోతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ ఇప్పట్లో ఆ ఓటమి నుండి కోలుకొని జగన్ ని దెబ్బకొట్టే అవకాశమే లేదు అనుకున్నారంతా. కానీ జగన్ మాత్రం తనంతట తానే టీడీపీకి త్వరగా కోలుకునే అవకాశాన్ని ఇస్తున్నారు.

ప్రజావేదిక కూల్చివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల రద్దు, ఇసుక కొరత.. ఇలా కొన్ని సందర్భాలలో టీడీపీకి స్వరం వినిపించే అవకాశాన్ని జగన్ ఇచ్చారు. అయితే ఘోర ఓటమిలో కూరుకుపోయిన టీడీపీని ఇవేవి చెయ్యి పట్టి పైకి లాగలేకపోయాయి. అలాంటి సమయంలో జగన్ నిర్ణయం రూపంలో టీడీపీకి ఓ వరం లభించింది. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకు తీసుకురావడం టీడీపీకి కలిసొచ్చింది. మూడు రాజధానుల వ్యవహారం అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించేలా చేసింది. రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ.. వారు గొంతెత్తి నినదిస్తున్నారు. లాఠీ దెబ్బలకు, అరెస్టులకు భయపడకుండా పిడికిలి బిగించి పోరాడుతున్నారు. వారికి టీడీపీ పూర్తిగా అండగా నిలబడింది. టీడీపీ నాయకత్వం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మేమున్నామన్న భరోసా ఇస్తోంది. ఇన్నిరోజులు ఓటమి చీకటిలో మగ్గిపోయిన టీడీపీ రేపటి వెలుగు కోసం పోరాటం మొదలుపెట్టింది. కార్యకర్తలు స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి టీడీపీ మళ్లీ ప్రజల నోళ్ళలో నానడం మొదలుపెట్టింది.

ఒక్కోసారి మనం వేసే ఒక్క అడుగు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. ఇప్పుడు రాజధాని విషయంలో జగన్ అలాంటి అడుగే వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందని అంటున్నారు. తెలుగువన్ సంస్థ క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.  రాజధాని తరలింపు ప్రతిపాదనతో... కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రాయలసీమ ప్రజల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే తమకి బాగా దూరమువుతుందన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఇవే ఇప్పుడు టీడీపీకి కలిసొస్తున్నాయి. రాజధానిపై పోరాటంతో టీడీపీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. చిన్న పెద్ద నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు రైతులు వెంట పోరుబాట పట్టారు. దీంతో ఆకు పచ్చ జెండా పట్టి ఉద్యమిస్తున్న రైతులకు పసుపు పచ్చ జెండా అండగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. మొత్తానికి.. 151 సీట్లతో ఘనంగా అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రశాంతంగా ఉండకుండా.. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చి.. టీడీపీకి పుంజుకునే అవకాశాన్ని ఇచ్చారని అంటున్నారు. జగన్ వేసిన ఈ ఒక్క రాంగ్ స్టెప్.. చంద్రబాబు నెత్తిన పాలు పోసి.. వైసీపీ వారిని తలలు పెట్టుకునేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

By
en-us Political News

  
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.