Publish Date:Apr 10, 2026
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చలూ, మరో వైపు దాడుల హెచ్చరికల మధ్య ఉద్రిక్తతలు సునామీ కెరటాల్లా ఎగసిపడుతున్నాయి. సరిగ్గా ఈ తరుణంలోనే ఇరాన్ అత్యంత రహస్యంగా అణ్వాయుధ పరీక్షను విజయవంతంగా నిర్వహించిందన్న వార్త ప్రపంచాన్ని వణికించేస్తున్నది. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, ఆ దేశ మాజీ ప్రధాని దిమిత్రీ మెద్వెదేవ్ ఇరాన్ అణు పరీక్ష నిర్వహించిందన్న సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు ఆయన వెల్లడించిన ఈ రహస్య వాస్తవమే.. ప్రపంచాన్ని నిలువెల్లా ఆందోళేనలో ముంచేసింది. అంతర్జాతీయ దౌత్యవర్గాలలో కలకలం రేపుతోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహితుడిగా పేరున్న మెద్వెదేవ్, సోషల్ మీడియా వేదికగా ఇరాణ్ అణ్వస్త్ర ఆయుధ సామర్ధ్యాన్ని పరీక్షించుకొందనీ, ఇందుకోసం ఆ దేశం చేసిన రహస్య ప్రయోగం సక్సెస్ అయ్యిందనీ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత గంటల వ్యవధిలో రష్యా మాజీ ప్రధాని మెద్వెదేవ్ ఇరాన్ అణ్వస్త్ర పరీక్ష నిర్వహించిందన్న బాంబు లాంటి వార్తను వెల్లడించారు. ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఇరాన్ అణ్వాయుధ పరీక్ష నిర్వహించడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
గత కొంతకాలంగా ఇరాన్ తన యురేనియం శుద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెబుతూనే ఉంది. అదే సమయంలో ఇరాన్ కూడా యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతోందని చెబుతూనే.. తమ అణు కార్యక్రమం కేవలం శాంతియుత అవసరాల కోసమేనని నమ్మబలుకుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మెద్వెదేవ్ వ్యాఖ్యలు వాస్తవమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రష్యాకు ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా.. మెద్వెదేవ్ వ్యాఖ్యలు విశ్వసించాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు. ఇరాన్ అణు సామర్థ్యం నిస్సందేహంగా ఇజ్రాయెల్ వంటి దేశాలకు పెను ముప్పు. అయితే మొద్వదేవ్ వ్యాఖ్యలను అమెరికా కానీ, ఇరాన్ కానీ ఇప్పటి వరకూ ఖండించలేదు. సమర్ధించలేదు. కానీ మెద్వెదేవ్ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో శాంతి ఎండమావేనా అన్న సందేహాలను కలిగిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iran-conducts-secret-nuclear-test-36-217064.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.