Publish Date:Apr 10, 2026
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. గుండెకు సంబంధించి సమస్యతో ఆయనను హఉటాహుటిన హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి గురువారం (ఏప్రిల్ 9) తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి, ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం యనమల రామకృష్ణుడుకు గుండెలో బ్లాకులు ఉన్నట్లు గుర్తించిన ఉవైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించి, ఒక స్టెంట్‌ను అమర్చారు.
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాగా తన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆందోళన అవసరం లేదనీ యనమల స్వయంగా ఒక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న తాను వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరారు.
త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి వస్తానని యనమల పేర్కొన్నారు. ఇలా ఉండగా వైద్యుల సమాచారం మేరకు యనమల కోలుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఆ తరువాతనే ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yanamala-falls-ill-36-217062.html
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.