హైదరా'బాధ' తీర్చలేకపోతోన్న మెట్రో రైల్!

Publish Date:Sep 12, 2016

Advertisement

హైద్రాబాద్ ఇప్పుడు మెట్రోపాలిటన్ కాదు కాస్మోపాలిటన్! అంటే... విశ్వనగరం అన్నమాట! మామూలు సమయాల్లో ఈ మాట బాగానే వుంటుంది కాని ప్రతీ ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ జాముల్లో హైద్రాబాదీలు పడే నరకయాతన అంతా ఇంతా కాదు! అప్పడు తెలుస్తుంది హైద్రాబాద్ నిజమైన స్టేటస్! అయితే, జనానికి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఇప్పుడప్పుడప్పుడే తీరేలా లేవు!  హైద్రాబాద్ ట్రాఫిక్ సమస్యలకి పెద్ద రిలీఫ్ అనుకున్నారు మెట్రో. ఇదుగో వస్తుంది, అదుగో వస్తుంది అంటూ ఊరించారు ప్రభుత్వం, నిర్మాణ సంస్థ వాళ్లు కూడా! కాని, లేటెస్ట్ సమాచారం ప్రకారం మెట్రో డ్రీమ్స్ ఇప్పుడప్పుడే తీరే సూచనలు ఎంత మాత్రం లేవు. నిజానికి పోయిన సంవత్సరమే తొలి మెట్రో ట్రైన్ చక్కర్లు కొడుతుందని ఎల్ అండ్ టీ చెప్పింది. కాని, వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఒక సంవత్సరం గడిచిపోతున్నా ఇప్పటికీ ఫస్ట్ మెట్రో పట్టాలెక్కలేదు...

సిటీ మొత్తం విస్తరించేలా అన్ని దిశల్లో సాగుతోన్న మెట్రో వర్క్స్ ఎక్కడా ఓ కొలిక్కి రాలేదు. నాగోల్ మెట్టుగుడా మధ్య ట్రాక్ పూర్తిగా సిద్ధమైనా ఇంత వరకూ మెట్రో సర్వీస్ మొదలు కాలేదు. ఇక మియాపూర్, ఎస్ ఆర్ నగర్ మధ్య లైన్ కూడా దాదాపు కంప్లీట్ అయింది. అయినా ఫినిషింగ్ టచ్చెస్ ఇస్తున్నారు. రైల్వే శాఖ నుంచి సర్టిఫికెట్ కూడా రావాల్సి వుంది. ఈ లైన్ కూడా సంవత్సరం కిందే ఉపయోగంలోకి రావాల్సి వుంది. మెట్టుగుడా, బేగంపేట మధ్య నడుస్తున్న మెట్రో వర్క్ కూడా ఆలస్యంగానే సాగుతోంది. ఈ లైన్ లో అనేక చోట్ల రైల్వే ట్రాక్ పైనుంచి మెట్రో బ్రిడ్జ్ కట్టాల్సి వుండటంతో పర్మిషన్స్ రాక పని మందగించింది. ఎంతో మంది ఉద్యోగస్థులకి ఉపయోగపడే బేగంపేట, శిల్పారామం లైన్ కూడా తాపీగా సాగుతోంది. ఈ సంవత్సరం పూర్తవతుందని మొదట చెప్పినప్పటికీ 2018 చివరికి కూడా డౌటే అంటున్నారు! ఎస్ ఆర్ నగర్, ఎల్బీనగర్ మధ్య నడవాల్సిన మెట్రో కూడా 2016లోనే జనానికి అందుబాటులోకి రావాల్సింది. కాని, అసెంబ్లీ భవనం వుండటంతో అలైన్మెంట్ ఛేంజ్ అంటూ చాలా రోజులు పనులు ఆపేశారు. ఇప్పుడు నడుస్తున్నా మరో రెండేళ్ల వరకూ పూర్తయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. మెట్రో పనుల్లో అత్యంత దారుణంగా నడుస్తున్న మార్గం జేబీఎస్, ఫలక్ నుమా. అసలు ఈ లైన్లో చాలా చోట్ల పని కొంచెం కూడా మొదలు కాలేదు. సుల్తాన్ బజార్ తొలగించాల్సి వుండటంతో చాలా రోజులు నిరసనలు కొనసాగాయి. ఎట్టకేలకు ఇప్పుడు అడ్డంకులు తొలిగినా పనులు నత్తనడకన సాగుతన్నాయే తప్ప స్పీడ్ అందుకోవటం లేదు!
అటు ప్రభుత్వం , ఇటు మెట్రో నిర్మాణ సంస్థ రెండూ చెబుతున్న లెక్కల ప్రకారం హైద్రాబాదీల కల ఇప్పుడప్పుడే తీరే సూచనలు కనిపించటం లేదు. మరో నాలుగేళ్లైతే తప్ప మెట్రో ఓ కోలిక్కి వచ్చే అవకాశం లేదు. పైగా మెట్రో పనులు ఆలస్యమైన కొద్దీ రోడ్డుపైన కూడా ట్రాఫిక్ జాములు పెరిగిపోయి నగర వాసులు నరకం చూస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎప్పుడు దీనిపై దృష్టి పెడుతుందో ఏంటో? 
 

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.