విశాఖ కమీషనర్ రామాంజనేయులకు త్వరలో బదిలీ?

Publish Date:Apr 3, 2012

Advertisement

మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) కమీషనర్, ఐఎఎస్ అధికారి అయిన బి. రామాంజనేయులును త్వరలోనే బదిలీ చేయాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖలో బి. రామాంజనేయులు తీసుకున్న నిర్ణయాలు అనేకం వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఆయన జిల్లా కలెక్టర్. జివిఎంసి ప్రత్యేక అధికారి అయిన లవ్ అగర్వాల్ తో గొడవ పెట్టుకున్నారు. నిజానికి లవ్ అగర్వాల్ రామాంజనేయులు కన్నా జూనియర్. కానీ రామాంజనేయులు నగరపాలక సంస్థ కమీషనర్ గా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా దానిని స్పెషల్ ఆఫీసర్ లవ్ అగర్వాల్ కు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ తనకన్నా జూనియర్ అయిన అధికారి ముందు తను చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదంటూ రామాంజనేయులు అన్ని ఏక పక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారు. తాజాగా పారిశుద్ధ్య పనులకోసం వార్డులవారీగా టెండర్లను రామాంజనేయులు తన పై అధికారి అయిన లవ్ అగర్వాల్ కు చెప్పకుండా పిలిచారు.

 

ఇప్పటిదాకా నిగ్రహంతో ఉన్న లవ్ అగర్వాల్ ఈ చర్యతో అగ్రహోదగ్రుడయ్యాడు. తనకు ఫైల్ పంపకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటూ రామాంజనేయులుకు నోటు పంపినట్లు తెలిసింది. వీరిద్దరి గొడవ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అందుకే త్వరలో రామాంజనేయులును ఇక్కడినుంచి బదిలీ చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది.

 

 

By
en-us Political News

  
ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ  ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అరవింద్‌ కుమార్‌ను ఏ 2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డీని ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.