Publish Date:May 12, 2012
సిబీఐ అధికారులు సాక్షి దినపత్రిక ఆర్ధిక లావాదేవీలను స్తంభింప చేయడంపట్ల బిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సాక్షి అకౌంట్లను స్తంభింపచేయడం అంటే పత్రికా స్వేచ్చపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించిన జగన్ వ్యాఖ్యలను మెజారిటీ వ్యక్తులు ఖండిస్తున్నారు. ఒక పత్రికా సంపాదకునిపై లేదా పత్రికలో పనిచేసే ఇతర పాత్రికేయ సిబ్బందిపై భౌతికంగా లేదా మానసికంగా దాడిచేస్తే తప్పు అవుతుంది. లేదా పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తలపై, వ్యాసాలపై ఆంక్షలు విధిస్తే అది పత్రికా స్వేచ్చను నివారించినట్లు అవుతుంది. దొంగలించిన డబ్బు దుర్వినియోగం కాకుండా తిరిగి ప్రభుత్వానికి అప్పగించడానికి బ్యాంక్ ఖాతాలను నిలిపివేస్తే తప్పు ఎలా అవుతుంది? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇదే సమయంలో పత్రికకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నిలిపివేయడం అంటే పరోక్షంగా పత్రిక ప్రచురణకాకుండా చూడటం, దాని ద్వారా పాత్రికేయుల ఉపాధిని దెబ్బతీయడమే అవుతుందనే వాదనలనూ కొందరు చేస్తున్నారు. పత్రిక బ్యాంక్ అకౌంట్ ను నిలిపివేసినా కొత్త అకౌంట్ ప్రారంభించడం ద్వారా పత్రిక కార్యకలాపాలను కొనసాగించుకావచ్చునని సిబీఐ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా సాక్షి బ్యాంగ్ అకౌంట్ల నిలిపివేతతో పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటి? పత్రికా స్వేచ్ఛ పేరుతొ పెద్దమనుషులు ఏ విధంగా లబ్ది పొందాలనే ఆలోచనతో వున్నారో సామాన్యులకు కూడా అర్థం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/freezing-of-accounts-24-13970.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.