Publish Date:Aug 24, 2012
నూతన ఎక్సయిజ్ పాలసీ కింద మద్యం దుకాణాల లైసెన్సులు మంజూరు చేసి దాదాపు రెండు నెలలవుతోంది. పాత వ్యాపారులతో ఒప్పందాలు కానీ, స్వయంగా కొత్తవారు నడుపు కోవటం కానీ, ప్రారంభమై రెండు నెలలైనా ఎక్సయిజ్ శాఖ కొత్తదుకాణదారుల ఆస్తుల పత్రాలను పరిశీలించలేక పోయింది. కల్తీమద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవటం, ఎమ్మార్పీ ధరలకు మద్యం అమ్మకాలు జరిగేలా చూడటం వంటి పలు అంశాలపై శాఖాపరంగా దృష్టిసారించటంతో ఈ పత్రాల పరిశీలనను ప్రభుత్వ సూచనల మేరకు రెవెన్యూశాఖకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,596 మద్యం దుకాణాలకు ధరఖాస్తులు ఆహ్వానిస్తే 5,959 దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేశారు. ఒకవేళ వ్యాపారి ఎప్పుడైనా లైసెన్సు ఫీజు చెల్లించకపోతే అఫిడవిట్ల ద్వారా డబ్బు రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కొందరు వ్యాపారులు నకిలీ పత్రాలు సమర్పించారని వెలుగులోకి వచ్చింది. అందువల్ల శ్రద్ధగా ఈ పత్రాల పరిశీలన చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖ ఇంకా ఈ పత్రాలు ఎంతవరకూ పరిశీలించిందో? వివరాలు వెల్లడిరచలేదు. దీంతో ఆ పరిశీలన ఎప్పటికి పూర్తవుతుందో కూడా అంచనా వేయటమే కష్టంగా ఉంది. ఇంకా ఎంత సమయం కావాల్సి ఉందో కూడా రెవెన్యూశాఖ ఎక్సయిజ్‌కు తెలియజేయలేదు. దీంతో ఈ పరిశీలన ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని మాత్రం అర్థమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/excise-department-delaying-in-veryfing-property-details-24-16828.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.