మల్లారెడ్డి కోడలి ఫ్లెక్సీలపై గులాబీ దుమారం..!
Publish Date:Sep 17, 2026
Advertisement
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..! మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. బీఆర్ఎస్‌లో కొత్త వివాదానికి తెరతీశాయి. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానిక గులాబీ పార్టీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి.ఫ్లెక్సీల్లో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోలు లేకపోవడంతో పాటు.. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫోటోలు కూడా కనిపించకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఐడిపిఎల్, సుచిత్ర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు చించివేశారు. పార్టీ ముఖ్య నేతల ఫోటోలకు బదులుగా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోటోలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంపై కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ అధిష్టానాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. స్వప్రయోజనాల కోసమే మల్లారెడ్డి రాజకీయాలు చేస్తున్నారని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పార్టీ పెద్దలను, స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించకుండా మల్లారెడ్డి కుటుంబం భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. అయితే.. ఈ వివాదంపై ప్రీతి రెడ్డి అభిమానులు మరో వాదన వినిపిస్తున్నారు. “ఇది పార్టీ కార్యక్రమం కాదు.. పుట్టినరోజు వేడుక. అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు పార్టీ నేతల ఫోటోలు ఎందుకు ఉండాలి?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అసలు పుట్టినరోజు ఫ్లెక్సీలతో మొదలైన ఈ వివాదం.. బీఆర్ఎస్‌లో రాజకీయ చర్చకు దారితీయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. [ Dr. Preethi Reddys birthday celebrations, Former Minister Mallareddy, KCR, KTR, BRS Party,
IDPL, Suchitra, MLA Marri Rajasekhar Reddy, CM Revanth reddy, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/dr-preethi-reddys-birthday-celebrations-24-231712.html





