ఇండియన్ల అమెరికా డ్రీమ్ పై ట్రంప్ నీళ్లు.!

Publish Date:Aug 25, 2026

Advertisement

ఇండియన్ల అమెరికా కలపై డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లారు. అమెరికాలో  ఐటీ రంగంలో స్థారపడాలని కలలు కనే ఇండియన్ టెక్కీలకు   డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా  సర్కార్ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాలపై విధించే ఫీజులను భారీగా పెంచేందుకు ప్రతిపాదించింది.  భారత కరెన్సీలో ఈ పెంపు ప్రతిపాదన 86 లక్షల రూపాయలు.    ఇప్పటివరకు   విదేశీ ఉద్యోగ నియమకాల వ్యయానికి ఈ భారీ మొత్తం   తోడవడం ఐటీ కంపెనీలతో పాటు టెక్ నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నది. 

అమెరికా ఏటా జారీ చేసే మొత్తం 85 వేల  క్యాప్ సబ్జెక్ట్ హెచ్-1బీ వీసాలన్నింటికీ ఈ నూతన అదనపు రుసుము వర్తించనుండటం గమనార్హం. ఇందులో భాగంగా అమెరికన్ విశ్వవిద్యాలయాల నుండి మాస్టర్స్,  ఉన్నత విద్యను పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించే 20 వుల మాస్టర్స్ కోటా వీసాలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది.  సాధారణ దరఖాస్తు రుసుములతో పాటు  86 లక్షల రూపాయల అదనపు మొత్తాన్ని కూడా ఉద్యోగాన్ని ఇచ్చే సంస్థలే భరించాల్సి ఉంటుంది.

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అంచనాల ప్రకారం ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి  ఏటా 8.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. ఈ భారీ నిధులను ప్రధానంగా వలస దరఖాస్తుల  పరిశీలన, వీసా మోసాల గుర్తింపు, జాతీయ భద్రత తనిఖీలు, పాత ప్రభుత్వ వ్యవస్థల ఆధునికీకరణ కోసం వినియోగిస్తామని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది.  

అయితే ఈ ప్రతిపాదనను అమెరికన్ వ్యాపార వర్గాలు, ఐటీ   నిపుణులు తీవ్రంగా  ముఖ్యంగా చిన్న, మధ్యతరహా కంపెనీలు అంతర్జాతీయ నైపుణ్యాన్ని అమెరికాకు తీసుకురావడం ఈ నిబంధన వల్ల చాలా కష్టంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రస్తుతం ఈ ఫెడరల్ ప్రతిపాదనపై 30 రోజుల పాటు ప్రజలు, సంస్థల అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఇండియన్ ఐటీ రంగంపై   ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

Donald Trump Propose huge hike on H1B Visa Fee, H1B Visa 86 Lakh Fee Hike, US Immigration Policy, Homeland Security,  H1B Visa Master Cap Fee

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.