కెప్టెన్సీ ని వదులుకుంటా ధోని
Publish Date:Jan 31, 2012
Advertisement
సిడ్నీ: ఇంగ్లాండ్, ఆస్టేలియాలలో ఘోర పరాజయాలను మూటగట్టుకున్నందుకు టీమిండియా జట్టు కెప్టెన్‌గా తాను భాద్యతను వహిస్తున్నానని మహేంద్ర సింగ్ ధోని ఓ ప్రముఖ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడారు. ఇంగ్లాండ్, ఆస్టేలియా టెస్టు సిరిస్‌లలో టీమిండియా ఓటమికి భాద్యత వహిస్తూ తాను తన కెప్టెన్సీని వదులు కోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఆస్టేలియా మీడియా ముందు ధోని కెప్టెన్సీ అనేది నేను అదనపు బాధ్యతగా భావించడం లేదు. సెలక్టర్స్ నన్ను కెప్టెన్సీ నుండి తోలగించినా నేను ఆనందంగా ఆ బాధ్యతల నుండి వైదోలగడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. టీమిండియా కెప్టెన్‌గా ధోనీ 2007వ సంవత్సరంలో బాధ్యతలను స్వీకరించాడు. తాను కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత టీమిండియా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది.
ఐతే ఇంగ్లాండ్, ఆస్టేలియా వరుస ఓటముల తర్వాత ధోనీ కెప్టెన్సీపై చర్చనీయాంశం అయింది. ఇటీవల ఆస్టేలియా క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ టీమిండియా కొత్త కెప్టెన్‌ని వెతకాల్సిన సందర్బం వచ్చిందని పేర్కోన్నడమే కాకుండా.. ధోనీ టెస్టు క్రికెట్‌కి మరిన్ని రోజులు సమాధానం చెప్పలేడని తేలికగా కొట్టి పారేశాడు. ధోనీని విదేశంలో జరిగిన ఈ రెండు టూర్స్‌లలో గమనించినట్లేతే బ్యాటింగే కాదు.. కీపింగ్‌లో కూడా ఏమంత ప్రతిభను కనబర్చలేదు. ఇది ఇలా ఉంటే ఇండియన్ క్రికెట్ మాజీలు ధోనిని సమర్దిస్తున్నారు. నా వరకు ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని కపిల్ దేవ్ అన్నాడు. నాలుగు సంవత్స రాల్లో కెప్టెన్‌గా ధోనీ రాణించిన విధానం అద్భు తం. 'ఇది గెలువు' అని అడిగిన ప్రతిదీ గెలిపించి పెట్టాడు. పరిమితులకు లోబడే గెలుపును సాధించాడు. ఇప్పుడు కూడా అదే పరిమితులను గుర్తించి ధోనీ విషయంలో నిర్ణయం తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని కిరణ్ మోరే అన్నాడు.
http://www.teluguone.com/news/content/dhoni-24-11476.html





