Publish Date:Aug 30, 2012
ముంబై మారణకాండ కేసులో ప్రథాన నిందితుడైన కసబ్ కి సుప్రీంకోర్ట్ ఉరిశిక్షని ఖరారు చేసింది. కసబ్ కి మరణ శిక్ష తప్ప మరో శిక్ష విధించడానికి వీల్లేదని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. రెండేళ్ల క్రితం కసబ్‌ను కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయమూర్తి ముందు దొంగనాటకాలు ఆడాడు. తాను బాలీవుడ్ సినిమాలో నటించేందుకు వచ్చానని, తనకు ఎకె 47 అంటే ఏంటో తెలియదని, కేవలం సినిమాలో నటించేందుకే తాను భారత్ వచ్చానని జడ్జికి చెప్పాడు. విచారణ తరువాత కోర్టు కసబ్ కి ఉరిశిక్ష విధించింది. జైలులో కూడా కసబ్ విచిత్రంగా ప్రవర్తించాడు. తాను ఏ తప్పు చేయలేదని, తనకు ముంబయి ఘటనతో సంబంధం లేదని తొలుత చెప్పిన కసబ్ ఆ తర్వాత తప్పును అంగీకరించాడు.
కసబ్ చిన్నప్పుడే తండ్రితో గొడవపడి ఇల్లు వదిలేసాడు. బతుకుదెరువు కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. దొంగతనాల కోసం ఆయుధాల కొనుగోలు సమయంలో లష్కరే తోయిబాతో పరిచయమయింది. కసబ్ చలాకీతనాన్ని గుర్తించిన లష్కరే తోయిబా అతనికి మంచి శిక్షణను ఇచ్చి భారత్‌పై దాడికి పంపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/death-for-ajmal-kasab-24-16989.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.