బీజేపీకి డేంజర్ బెల్స్.!
Publish Date:Aug 28, 2026
Advertisement
దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు ఆ విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఈ సర్వే ప్రకారం గతంతో పోలిస్తే బీజేపీకి ప్రజాదరణ గణనీయంగా తగ్గింది. తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలే వీస్తోంది. అదే సమయంలో ఇండియా కూటమి పట్ల ప్రజలలో విశ్వాసం పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వే పేర్కొంది. ప్రజల్లో ఈ రకమైన మార్పు రావడానికి ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరల మంట, వ్యవసాయ రంగంలో సంక్షోభం కారణంగా సర్వే పేర్కొంది. వీటికి తోడు ఇటీవల ఎదురైన కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, ఆర్థిక ఒడిదుడుకులు యువత, మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి పెరగడానికీ, బీజేపీ వ్యతిరేకత పెచ్చరిల్లడానికీ కారణంగా సర్వే పేర్కొంది. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్ ఇతర నేతలతో.. ముఖ్యంగా రాహుల్ గాంధీతో పోలిస్తే బెటర్ గానే ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల క్షేత్రస్థాయిలో ప్రతికూలత కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉనికి చాటుకోవడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జరిగే వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, ఉపఎన్నికలు కేంద్ర ప్రభుత్వ పనితీరుకు పరీక్షగా నిలవనున్నాయి. మొత్తం మీద కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికార పగ్గాలు చేపట్టిన మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకత వేగంగా పెరుగుతోందని సర్వే పేర్కొంది. (Danger bells to BJP, Mood of the Nation Survey, BJP NDA Lok Sabha Seats, India Today C Voter Survey, National Political Trends, Telugu One)
http://www.teluguone.com/news/content/danger-bells-to-bjp-23-230133.html





