అర్నబ్ ఎఫెక్ట్: తమిళనాట అతి భారీ వర్షాలు..14 మంది మృతి.!

Publish Date:Oct 26, 2026

Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకు వస్తోంది. అదే సమయంలో భారీ వర్షాలతో తమిళనాడును అతలాకుతలం చేసింది.  దక్షిణ తమిళనాడుతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  కొండ ప్రాంతాల్లో మట్టిచరియలు విరిగిపడటంతో రహదారులు ధ్వంసమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  

 ఊటీకి వెళ్లే రైలుమార్గంలో బండరాళ్లు పడటంతో రైలు సర్వీసులను నిలిపివేశారు. తిరిగి ఈ నెల 29 నుంచి ఆ మార్గంలో రైలు సర్వీసులను పురనుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.  ఇక కొడైకెనాల్ లోనూ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది.  ఘాట్ రహదారులపై మట్టిచరియలు, రాళ్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల  విద్యుత్ సరఫరా   నిలిచిపోయింది.  అతి భారీ వర్షాల కారణంగా తమిళనాట   14 మంది మరణించారు.  మృతుల కుటుంబాలకు  లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.  

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అర్నాబ్ తుపాను ఎఫెక్ట ఏపీపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుపాను తీవ్ర తుపానుగా మారి బుధవారం (అక్టోబర్ 28)  బాపట్ల విశాఖ  మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను  ప్రభావంతో ఉత్తర, మధ్య కోస్తా జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. సహాయక చర్యలకు ఏర్పాట్లు చేసింది. తుపాను కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


[Cyclone Arnab Effect Heavy Rains  Tamil Nadu, Landslides, Ooty Train Services, Andhra Pradesh, Severe Effect, Government, High Alert, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.