త్రిష ఎంట్రీ.. ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్..!

Publish Date:Sep 13, 2026

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీజే విజయ్, ప్రముఖ నటి త్రిషల కలయికకు సంబంధించిన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది. బ్రిటన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో జరిగిన మిచెలిన్ లే మాన్స్ కప్ మోటార్ రేసింగ్ ఈవెంట్ వేదికగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే అధికారిక పర్యటనలో భాగంగా యూకే వెళ్లిన సీఎం విజయ్, అక్కడ రేసింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 

ఈ 44-కార్ల ప్రతిష్టాత్మక గ్రిడ్ రేస్‌ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా గ్రీన్ ఫ్లాగ్ ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు దిగ్గజ నటులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం కోలీవుడ్ వర్గాల్లో అభిమానులలో నూతన ఉత్సాహాన్ని నింపింది. గత 34 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న తమ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అజిత్ కుమార్ స్వయంగా సీఎం విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  అయితే ఈ పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే సమయంలో లండన్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ నటి త్రిష కూడా సరిగ్గా ఇదే సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్ ప్రాంతంలో ప్రత్యక్షమవడం సర్వత్ర చర్చనీయాంశమైంది.

సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ త్రిషతో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేక్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రేసింగ్ ఈవెంట్ జరిగే వేదిక వద్ద విజయ్, త్రిష ఒకే ప్రాంతంలో ఉండటం, వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడం వేగంగా జరిగిపోయాయి. ముఖ్యంగా కెమెరా కంట పడగానే ఇద్దరూ అప్రమత్తమై రైలింగ్ పక్కనుంచి కాస్త పక్కకు తప్పుకున్న క్లిప్స్ సోషల్ మీడియాలో రికార్డుస్థాయిలో వ్యూస్‌ను రాబడుతున్నాయి.  ఇప్పటికే విజయ్-త్రిషల మధ్య వ్యక్తిగత సంబంధాలపై రకరకాల రూమర్లు, ఊహాగానాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. 

ముఖ్యంగా సీఎం విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ, చెన్నైలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఈ చర్చలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు ఏకంగా వేరే దేశంలో, ఒకే అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ వేదికపై వీరిద్దరూ కనిపించడంతో ఈ పుకార్లు మరోసారి ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేకపోయినప్పటికీ, అభిమానులు  రాజకీయ ప్రత్యర్థులు సై దీనిపై విభిన్న కోణాల్లో చర్చించుకుంటున్నారు. చెన్నై వేదికగా ఇలాంటి అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించే ప్రణాళికలపై సీఎం విజయ్ కసరత్తు చేస్తుండగా, ఈ యూకే పర్యటన మాత్రం రాజకీయంగానూ, సినిమా పరంగానూ ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు.  

 

 

 

[ CM Vijay UK tour, Ajith Kumar racing, Silverstone Circuit, Trisha London shoot, Thalapathy Vijay news, Vijay and Ajith, Le Mans Cup Silverstone, Tamil cinema news, Vijay Ajith friendship, Tamil Nadu politics and cinema ]


 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.