రెండు రోజుల సీఐఐ సదస్సు: కుదిరిన ఎంవోయూల విలువెంతంటే.?

Publish Date:Nov 14, 2026

Advertisement

విశాఖపట్నం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 303 ప్రాజెక్టులకు సంబంధించి రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడికి సంబంధించిన ఎంవోయూలు కుదిరాయి.  ఈ సదస్సు లక్ష్యం,  పెట్టుబడులను ఆకర్షించడమే మాత్రమే కాదనీ, నిర్దేశిత గడువులోగా వాటిని క్షేత్రస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావడమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. సీఐఐ సదస్సు ముగింపు సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ఈ రెండు రోజుల భాగస్వామ్య సదస్సులో,  65 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారన్నారు. 

ఈ సదస్సు వేదికగా రిలయన్స్ సంస్థ  2.43 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. అలాగే కియా సంస్థ ఏడాదికి అదనంగా రెండు లక్షల కార్ల ఉత్పత్తి కోసం 18,878 కోట్లతో  పెనుగొండ కియా ప్లాంట్ విస్తరణకు   ఒప్పందం చేసుకుందని చంద్రబాబు వివరించారు. 

2024 నుంచి రాష్ట్రానికి వచ్చిన 714 పెట్టుబడి ప్రతిపాదనల్లో ఇప్పటికే 522 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి, అవుతున్నాయని వివరించారు. స్వచ్ఛ షహర్ కేటగిరీలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచిన విశాఖలో ఈ సదస్సు జరగడం గర్వకారణమన్నారు.

పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, నాలా చట్టాన్ని రద్దు చేసి కేవలం 13 లైసెన్సులతో ఐదు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రవేశపెట్టిన ఎస్క్రో ఖాతా విధానం దేశానికే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందన్నారు. అంతేకాకుండా, పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పించేందుకు  ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తెస్తామని ప్రకటించారు. గతంలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లుగానే, ఇప్పుడు  వన్ ఫ్యామిలీ వన్ ఏఐ' విధానం ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేట్ వే భోగాపురం ఎయిర్‌పోర్ట్ : లోకేష్

పునరుత్పాదక ఇంధన రంగంలో దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఉండగా, ఏపీ ఒక్కటే 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేపట్టిన  పీ4 ద్వారా ఇప్పటికే లక్ష మంది మార్గదర్శులు 11 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నారని చంద్రబాబు చెప్పారు. మరోవైపు, దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు గోదావరి, కావేరి నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమన్న ఆయన మనమంతా ముందుగా భారతీయులమనే భావనతో రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా నీటి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, విభజన కష్టాలను అధిగమించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అసాధారణ విజయమన్న ఆయన..  టెక్నాలజీ, ఏఐని పాలనలో వినియోగించడం అభినందనీయమన్నారు.  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం ముఖ్యమంత్రి పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.  

మీకు నచ్చవచ్చు: సాంకేతిక విప్లవం నుంచి అమరావతి క్వాంటమ్ హబ్ వరకు.. సీఎం చంద్రబాబు భవిష్యత్తు విజన్.!

ప్రభుత్వంతో మంచు మనోజ్ భార్య ఎంవోయూ: సీఐఐ వేదికగా సంతకాలు.!

[CIIPartnershipSummit, APInvestmentProposals, River Linking TeluguOne]

By
en-us Political News

  
రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో  కార్యరూపం దాల్చేలా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం పురోగతిపై ప్రతి ఏటా   ఆడిట్ నివేదికను విడుదల చేస్తామని ప్రకటించారు.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్ కు వైద్యులు అత్యవసర చికిత్స అందించి, కాలు తీసివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  హేమంత్ ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారడంతో..అతడిని మెరుగైన చికిత్సఅందించేందుకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విశాఖలో సినిమా, క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి సహకారం అందిస్తాం..!
మురసు తుపాను కారణంగా రాష్ట్రంలో  2,484.43 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో వెల్లడైంది. రాష్ట్రంలోని 106 మండలాలు, 315 గ్రామాల పరిధిలో దాదాపు 1.93 లక్షల మంది ప్రజలు ఈ తుపాను ప్రభావానికి గురయ్యారని రాష్ట్ర అధికారులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి నివేదించారు.
విశాఖపట్నంలో వైభవంగా జరుగుతున్న సీఐఐ సదస్సు కేవలం పారిశ్రామిక ఒప్పందాలకే కాకుండా, ప్రముఖుల ఆసక్తికర సంభాషణలకు కూడా వేదికగా నిలిచింది.
భవిష్యత్తు ఏపీ ఎలా ఉండబోతోంది.. సీఎం చంద్రబాబుతో జర్నలిస్ట్ పాల్కి శర్మ ముఖాముఖి.!
తొలి రోజు  రాష్ట్రంలోకి ఏకంగా 5.84 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.  మొత్తం 88కి పైగా కీలక ఒప్పందాలు    కుదిరాయి. ఇందులో భాగంగా 73 అవగాహన ఒప్పందాలు,  15 ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ భారీ పెట్టుబడులకు బాటలు పడ్డాయి. ఈ పారిశ్రామిక ప్రాజెక్ట్‌ల  1.07 లక్షల ప్రత్యక్ష,  పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
దేవాంశ్‌ డైనోసార్ల నేపథ్యంతో  డైనో డీట్స్ పేర ఒక పాడ్‌కాస్ట్,  యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ఏడాది మేలో మొదలైన   ఈ పాడ్‌కాస్ట్ ఇప్పటివరకు పాతిక ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ప్రతి ఎపిసోడ్ లక్షల సంఖ్యలో వ్యూస్ ను సంపాదించింది.
భూమా మౌనిక రెడ్డి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో భారీ పారిశ్రామిక యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.  36 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో  ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధ్వర్యంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీని నెలకొల్పి, క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని కోరిన లోకేష్.. లక్నో,  డర్బన్ సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీల నిర్వహణ అనుభవం ఉన్న ఆర్‌పీఎస్‌జీ గ్రూప్..  రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లో ఒక స్థానిక జట్టును కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
డిక్సన్ టెక్నాలజీస్ రాష్ట్రంలో కొత్తగా  700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది.   మంత్రి నారా లోకేష్‌తో ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ పంకజ్ శర్మ విశాఖలో  భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్   వేదికగా ఈ పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ సానుకూలత వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పూణేలో విజయవంతంగా అమలవుతున్న లిక్విడ్ రోబోటిక్స్  కో-ప్రొడక్షన్ నమూనాను నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె కేంద్రంగా పునరావృతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ నికుంజ్ పరాశర్ ను కోరారు.
2029 ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో కీలకమైన రానున్న రెండేళ్లలో ఇప్పటి వరకూ గమనించిన పాలనా లోపాలను సరిదిద్దడమే కాకుండా, ఇటు ప్రభుత్వం, అటు పార్టీని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు చంద్రబాబు నడుంబిగించారని అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.