ఐన్‌స్టీన్‌ కంటే ఎక్కువ ఐక్యూ.. భారత బాలమేధావి ప్రతిభకు ప్రపంచమే ఫిదా.!

Publish Date:Oct 13, 2026

Advertisement

12 ఏళ్లకే 180 ఐక్యూ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న భారత బాలమేధావి. !

కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన పన్నెండేళ్ల బాలుడు రిషి శివ ప్రసన్న తన అసాధారణ మేధస్సుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. చిన్న వయసులోనే ఆయన ప్రదర్శిస్తున్న ప్రతిభ ఎంతోమందికి ఆశ్చర్యం కలిగిస్తుండటమే కాకుండా, యువతకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. ఈ బాలమేధావి ఐక్యూ లెవల్ సుమారు 180 వరకు ఉంటుందని అంచనా. ఇది ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఊహించిన 160 ఐక్యూ కంటే కూడా అధికం కావడం విశేషం. ఈ అరుదైన మేధస్సుతో రిషి అతి చిన్న వయసులోనే టెక్నాలజీ, సాహిత్య రంగాలలో విస్మయకర విజయాలు సాధించారు.

కేవలం ఐదేళ్ల ప్రాయంలోనే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన రిషి.. గూగుల్-సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ డెవలపర్‌గా ఎదిగారు. అంతేకాకుండా 'ఐక్యూ టెస్ట్ యాప్ ఫర్ కిడ్స్', 'కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్', 'కోవిడ్ హెల్ప్ ఫర్ బెంగళూరుటెన్స్' వంటి వినూత్న మొబైల్ అప్లికేషన్లను డెవలప్ చేసి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. సాంకేతిక రంగంలోనే కాకుండా సాహిత్య రంగంలోనూ రిషి తన ముద్ర వేశారు. మొదటి తరగతి చదువుతున్న సమయంలోనే 'లెర్న్ విటమిన్స్ విత్ హారీ పోటర్' పేరుతో తొలి పుస్తకం రాశారు. ఆ తర్వాత సైన్స్, స్పేస్, కాల ప్రయాణం వంటి సంక్లిష్టమైన అంశాలపై 'టైటానియం టైమ్ ట్రావెలర్స్' వంటి పుస్తకాల సిరీస్‌ను కూడా రూపొందించారు.

ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2023లో ప్రతిష్టాత్మకమైన 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్' అవార్డును అందజేసి ఘనంగా సత్కరించింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం రిషి సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా అభినందించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ విద్య, వైద్య రంగాలలో మానవాళికి ఎంతో మేలు చేస్తుందని రిషి గట్టిగా విశ్వసిస్తున్నారు. కేవలం డిజిటల్ రంగానికే పరిమితం కాకుండా, కార్ల నుంచి వెలువడే హానికరమైన పొగను శుభ్రమైన గాలిగా మార్చే ప్రత్యేక యంత్రాన్ని తయారు చేయాలనే వినూత్న ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు. చిన్న వయసులోనే మేధోపరంగా సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తున్న రిషి శివ ప్రసన్న.. రాబోయే కాలంలో మరిన్ని అద్భుతమైన ఆవిష్కరణలతో దేశం గర్వించదగ్గ ప్రముఖ శాస్త్రవేత్తగా లేదా టెక్ దిగ్గజంగా ఎదుగుతారని నిపుణులు, ప్రజలు గట్టిగా ఆశిస్తున్నారు.

 

 

 

[ Child Genius Rishi Shiv Prasanna, 180 IQ Child Prodigy, Albert Einstein, Google Certified Developer, Pradhan Mantri Rashtriya Bal Puraskar, Indian Youngest Author and Coder, PM MODI, Telugu News, Telugu One News ] 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.