ఎన్నికల్లో డబ్బు ఆపటం సాధ్యమేనా?
Publish Date:May 14, 2012
Advertisement
రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు ఎన్నికలకమీషన్ కు పెనుసవాల్ గా పరిణ మించాయి. ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీని ఆపటానికి ఇసి ఎన్నిచార్యాలు తీసుకుంటే దానికి భిన్నంగా అన్నిదారులను అభ్యర్థులు వెదుక్కుంటున్నారు. డబ్బు తీసుకున్న ఓటరు కూడా ఏమీ తెలియనట్లు వ్యవహరించే పరిస్థితులూ ఉన్నాయి. ఎందుకంటే డబ్బు తీసుకున్న ఓటరు జైలు ఊచలు లెక్క పెట్టా ల్సిందేనన్న ఎన్నికల సంఘం కమీషనర్, రాష్ట్ర ఇన్ ఛార్జీల హెచ్చరికలు వారిని భయపెడుతున్నాయి. అసలు డబ్బు ఇచ్చేవాడిని వదిలేసి ఓటరును మాత్రం ఎందుకు పట్టు కుంటున్నారని పలుప్రాంతాల వారు ఎదురుప్రశ్న వేస్తున్నారు. ఇంకా ఓటరును ప్రలోభపెట్టే ఇతర అంశాలేవున్నాయో అభ్యర్థులు పరిశీలిస్తున్నారు. డబ్బుకు ప్రత్యామ్నాయంగా బహుమతులు, ఇతర దారులు అభ్యర్థులు వెదుకుతున్నారు. ప్రత్యేకించి డబ్బు ప్రవాహాన్ని ఆపేందుకు ఇసి చెక్ పోస్టుల్లో తనిఖీలు పెట్టడం మాత్రం సత్ఫలితాలను ఇస్తున్నాయి. అయితే దొరికిన నిందుతులు అభ్యర్థుల పేర్లు చెప్పటానికి నిరాకరిస్తున్నారు. అంటే దొంగలు దొరికినా అసలుదొంగని దాచేయటం లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ చెక్ పోస్టుల పుణ్యమా అని ఓటర్ల పంపిణీకి సిద్ధం చేసిన డబ్బు ప్రభుత్వానికి భారీగానే చేరవచ్చు. ఇదీ ఒకరకంగా ప్రభుత్వానికి ఆదాయం లాంటిదే అని భావించాలి. దేశ, రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం లాంటి తూర్పుగోదావరి జిల్లా అన్నింటా ముందుంటుంది. ఈ డబ్బు పంపిణీ కేసుల విషయంలోనూ అలానే ముందుంది. ఈ జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల పంపిణీకి ఉద్దేశించిన రూ13.86 లక్షలు కుతుకులూరు నుంచి తరలిస్తుండగా పసలపూడి బైపాస్ పోలీసు చెక్ పోస్టు తనిఖీల్లో బయటపడింది ఎపి 5సిఏ 2223 హోండా ఐ20 కారులో ఈ డబ్బును వేపకాయల హనుమంతరావు, సి,హెచ్, శ్రీనివాసులు రామచంద్రాపురం తీసుకువస్తుండగా డిఎస్పీ ఎస్.శ్రీనివాసు ఆధ్వర్యంలో సిఐ చలసాని సురేష్ పట్టుకున్నారు. వీరిద్దరిపైనా కేసు నమోదు చేశామని డిఎస్పీ తెలిపారు. ఈ డబ్బు ఒక రాజకీయపార్టీదని అనుమానిస్తున్నామని, ఇంకా విషయం తేలాల్సి ఉందని డిఎస్పీ 'తెలుగువన్.కామ్' కు చెప్పారు. ఇంకా పటిష్టంగా చెక్ పోస్టులతో తనిఖీలు కొనసాగిస్తామన్నారు. అయితే ఎన్నికల కమీషన్ ఇంకా చట్టాన్ని పదునుపెట్టాల్సిన అవసరముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, సారా ప్రవాహంలా కొట్టుకువస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఇది ఎన్నికల కమీషన్ కు పెద్ద సవాల్ లాంటిదేనని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/challenge-to-election-commission-24-14017.html





