సింగరేణి కార్మిక ఎన్నికల్లో భగ్గుమన్న వేర్పాటువాదం?

Publish Date:May 14, 2012

Advertisement

ఖమ్మం జిల్లా సింగరేణి బొగ్గుగనులు తెలంగాణా ప్రాంతంలో ఉన్నాయి. అందుకే ఇక్కడ కూడా సీమాంధ్ర, తెలంగాణా వాదనలు కార్మికసంఘ ఎన్నికల్లో ప్రచారానికి అస్త్రలయ్యాయి. ఈ వేర్పాటువాద ధోరణిలో ఎన్నికలు జరగటం ఇదే ప్రథమమని కార్మికులంటున్నారు. ప్రత్యేకించి అన్ని ప్రాంతాల వారూ ఈ బొగ్గు గనుల్లో పనిచేస్తున్నందున ఈ ధోరణి సాంఘిక భద్రతకు ముప్పుతెచ్చేవాతావరణం కల్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

జాతీయ సంఘాలుగా గుర్తింపు పొందిన ఐఎ.న్.టి.యు.సి., ఎ.ఐ.టి.యు.సి.లను టి.ఆర్.ఎస్. ఆవిర్భావం నుంచి సమైక్యవాద యూనియన్లుగా చూపుతున్నారని తెలిపారు,. తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం (టీ.బీ.జీ.కే.ఎస్) ఏర్పడినప్పటి నుంచి ఈ యూనియన్లను వెలివేసినట్లు ప్రచారం చేస్తోందని స్పస్తం చేశారు. ఈ యూనియన్ ఏర్పాటుకు పూర్వం మొత్తం లక్షా 6వేల మంది కార్మికులు ఈ గనులపై ఆధారపడ్డారు. ఇప్పుడు సుమారు 65 వేల మంది కార్మికులు మిగిలారు.

 

కార్మికుల సంఘ్య పడిపోవటానికి సమైక్యవాద యూనియన్లే కారణమని టీ.బీ.జీ.కే.ఎస్ ప్రచారం చేస్తోంది. ఇదే ఎన్నికల్లో పోటీ చేస్తున్న జాతీయ యూనియన్లు మాత్రం ఈ వేర్పాటువాద ప్రచారానికి దూరంగా ఉంటూ ఏళ్ళ తరబడి కార్మిక సంక్షేమా నికి తాము చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం చేసు కుంటున్నాయి. వీరితోపాటు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సి.ఐ.టి.యు, అనుబంధ) పోటీలో ఉంది.

 

ఇప్పటి వరకూ గెలిచినా అన్ని యూనియన్ల నాయకులూ యాజమాన్యానికి తొత్తులైనందున తమకు అవకాశమిస్తే కార్మిక హక్కులను కాపాడతామని సిగారేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రకార్యదర్శి మందానరసింహా రావు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అసలు తాము వేర్పాటువాద ధోరణిని ప్రోత్సహించమనీ, ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేకాంధ్ర పేరిట ప్రచారాలను నమ్మమని కార్మికులు స్పష్టం చేశారు. తమకు ఎవరు ఎక్కువ సహకరిస్తారో వారికే ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు. అయితే గనులు తెలంగాణాలో ఉన్నందున ప్రత్యేక రాష్ట్రం ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుందని, ఈ సారి ఎన్నికల్లో మాత్రం తమ హక్కులు కాపాడే సంఘానికే ప్రాధాన్యత ఇస్తామని కార్మికులు తెలిపారు.

By
en-us Political News

  
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.