ఏపీలో పారిశ్రామిక పురోగతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.!
Publish Date:Nov 12, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి, ప్రైవేట్ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి చంద్రబాబు సర్కార్ ఆకర్షణీయమైన రాయితీలను ఇస్తున్నది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి పెద్దపీట వేస్తూ, దరఖాస్తుల పరిశీలన నుంచి ప్రాజెక్టుల గ్రౌండింగ్ వరకు అన్ని ప్రక్రియలను అత్యంత వేగవంతం చేస్తోంది. అంతే కాదు దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా రాయతీలు ఇస్తూ పారిశ్రామిక దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్న రాష్ట్రం ఏపీయే. పెట్టుబడిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేయడం ద్వారా ప్రాజెక్టుల శీఘ్ర అమలుకు బాటలు వేస్తున్నది. అలాగే నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే సంస్థలకు భూ కేటాయింపులలో వెసులుబాట్లు, విద్యుత్ ఛార్జీలలో రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలను అందించడం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తరలి వచ్చేందుకు మార్గం సుగమం చేసింది. అంతే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ఆటోమొబైల్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యువబుల్ ఎనర్జీ , ఎలక్ట్రిక్ వెహికల్ రంగాల పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీల అందిస్తున్నది. ఇది కూడా చదవండి: ఏపీలో పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం.. ఒకే నెలలో 2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టుబడులు ప్రతిపాదనల దశ నుంచి వాస్తవ రూపం దాల్చే వరకు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా వాటి గ్రౌండింగ్ ను వేగవంతం చేస్తున్నది. ఈ వినూత్న విధానాల ఫలితంగా దేశవిదేశాల నుంచి ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మీకు నచ్చవచ్చు: ఏపీ ఫార్మా రంగంలో పెట్టుబడులకు భారీ అవకాశాలు: పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం.! ఏపీలో కియా విస్తరణ: 14 వేల 167 కోట్ల పెట్టుబడి: విశాఖ ఇన్వెస్టర్ల సదస్సులో ఎంవోయూ.! [Andhrpradesh, Industrialpolicy, Incentives, Investments, TeluguOne]
అమరావతి క్వాంటమ్ వ్యాలీ, శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ, ఒర్వకల్ డ్రోన్ సిటీ వంటి అత్యాధునిక టెక్నాలజీ హబ్‌ల రూపకల్పన ద్వారా భవిష్యత్ పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తున్నది.
.
http://www.teluguone.com/news/content/andhrpradesh-43-236899.html





