ఫ్లైదుబాయ్ హీరో పైలట్ స్మిత్ మచ్ఛార్‌తో.. ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ.!

Publish Date:Oct 2, 2026

Advertisement

ఆకాశ మార్గంలో ఊహించని ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఒక భారతీయ పైలట్ ప్రదర్శించిన అసాధారణ తెగువ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ చేసిన ప్రమాదకర కుట్రను తన ప్రాణాలను పణంగా పెట్టి తిప్పికొట్టిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌‌తో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు.ఈ సాహసోపేత ఘటన వివరాలను, ఆ సంక్షోభ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను పైలట్ స్మిత్ ప్రధానికి వివరించారు. తీవ్ర గాయాలపాలైనప్పటికీ, విమానాన్ని కాపాడుకునేందుకు తాను ఏ విధంగా తెగువ ప్రదర్శించాల్సి వచ్చిందో ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా పైలట్ చూపిన సంయమనాన్ని, మనోధైర్యాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.దుబాయ్ నుంచి టెల్ అవీవ్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కోపైలట్ అకస్మాత్తుగా దాడికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

విమానాన్ని కూల్చేసేందుకు కోపైలట్ యత్నించగా, తీవ్ర గాయాల బారిన పడినప్పటికీ కెప్టెన్ స్మిత్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. సమయస్ఫూర్తితో కాక్ పిట్ తలుపులు తెరిచి ప్రయాణికులకు, సిబ్బందికి సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ విపత్కర సమయంలో తనను ఏది కాపాడిందో వివరిస్తూ, కష్ట సమయాల్లో తాను నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తానని, ఆ విమాన ప్రయాణంలోనూ అదే ధైర్యంతో ఉన్నానని స్మిత్ ప్రధానితో భావోద్వేగంగా పంచుకున్నారు. ప్రధానమంత్రి తనను స్వయంగా ఫోన్ చేసి పలకరించడం తన జీవితంలో ఎప్పటికీ మరువలేని ప్రత్యేక క్షణమని, మోదీనే తన అతిపెద్ద ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదని, అవసరమైతే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇతరులను కాపాడేవారనే సత్యాన్ని స్మిత్ మరోసారి నిరూపించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ సాహస కృత్యం ద్వారా అతడు ప్రపంచ దేశాల ముందు దేశ కీర్తిని ఇనుమడింపజేశాడని అన్నారు. 

అంతకుముందు పైలట్ తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణికి కూడా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.ఇదే కోణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం స్పందిస్తూ, ఈ భారతీయ పైలట్ చూపిన తెగువ మరో 9/11 తరహా పెను ఉగ్రవాద విషాదాన్ని అడ్డుకుందని ప్రశంసించారు. అమెరికా నాయకులు సైతం ఈ సాహసయోధుడిని హీరోగా అభివర్ణించారు. ప్రస్తుతానికి అబుదాబిలో వైద్య చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నారు. అంతర్జాతీయ విమానయాన రంగంలో 'ఇన్‌సైడర్ త్రెట్' (సిబ్బంది నుంచే ముప్పు) అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విమానయాన సంస్థలు మరింత కఠినమైన భద్రతా నిబంధనలను, తనిఖీలను అమలు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశం గర్వించదగ్గ రీతిలో వ్యవహరించిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు ఉన్నత స్థాయి పురస్కారాలు దక్కాలని పౌర సమాజం నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

[ Captain Smit Machchaar, PM Modi, Flydubai incident, Indian pilot bravery, Israel-bound flight hijack attempt, FlyDubai, Dubai Tel Aviv flight, Hero pilot attack, Hanuman Chalisa,Telugu One, Telugu News ]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.