విలక్షణమైన ఉప ఎన్నికలు
Publish Date:Apr 14, 2012
Advertisement
రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు అనేక ప్రత్యేకలతో విలక్షణ ఎన్నికలుగా చరిత్రలో నమోదు కానున్నాయి. దేశంలో పార్టీ పిరాయింపు చట్టం 1995 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన రాష్ట్రంలో ఈ చట్టం కారణంగా అ పార్లమెంట్ సభ్యుడు కానీ, శాసన సభ్యుడు కానీ అనర్హత వెతుకు గురికాలేదు. ఈ చట్టం కింద తొలిసారిగా ఒకేసారి 17 మంది సభ్యత్వాలు కోల్పోవడం, పిరాంపుల కారణంగా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికలు జరగనున్న 18 స్తానాలు గతంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినవి కావటం మరో విశేషం. 18 స్థానాలలో 17 మంది సభ్యులు కాంగ్రెస్ ఉత్తర్వులను ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి అనుకూలంగా వ్యవహరించినందుకు పదవులు పోగొట్టుకుంటే, 18వ స్థానం తిరుపతి నియోజకవర్గానికి చెందిన చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టిని కాంగ్రెస్ పార్టిలో విలీనం చేయడం ద్వారా రాజ్యసభ సభ్యత్వం పొంది శాసన సభ్యత్వాన్ని వదిలివేశారు. అంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్లనే కాదు ..... అనుకూలంగా వ్యవహరించడం వాళ్ళ కూడా శాసనసభ స్థానం ఖాలీ అయి ఉపఎన్నికలు జరగనున్నాయి. 18 స్థానాలలో ఒక స్థానం తెలంగాణా పరకాలలో వుండగా 17 కొస్తాలో ముడు జిల్లాలు మినహా అన్ని ప్రాంతాలు ఉన్నాయి.అందువల్ల ఉపఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యను తెలపడమే కాకుండా 2014లో జరిగే సాదారణ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/by-polls-2012-24-13369.html





