Publish Date:Aug 28, 2012
రెవెన్యూ శాఖలో లంచగొండులెక్కువైపోయారు. మన రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అవినీతికి అలవాటుపడిపోయిన ఉద్యోగులు ఎక్కువసంఖ్యలో రెవెన్యూ శాఖలోనే ఉన్నారని లేటెస్ట్ సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయ్. గడచిన మూడేళ్లలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఉద్యోగుల్లో ఎక్కువశాతంమంది రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులే. మూడేళ్లుగా రెవెన్యూ శాఖ ఉద్యోగులపై నమోదైన అవినీతి కేసులు 267. 2009లో 123 అవినీతి కేసులు విచారణకొచ్చాయి. 2010లో 41, 2011లో జూలై నెలవరకూ 33 కేసులు కేవలం రెవెన్యూ శాఖ ఉద్యోగులమీదే నమోదయ్యాయి. రెవెన్యూ శాఖకు పనిభారం కూడా ఎక్కువే. దానికితోడు ప్రజలకు ఎక్కువ అవసరాలు ఈ శాఖతోనే ఉంటాయి కనుక లంచాల వసూలుకూడా ఎక్కువేనన్న విషయంకూడా బహిరంగ రహస్యమే. రోజులకొద్దీ ఆఫీసులచుట్టూ తిరగడంకంటే టిక్కెట్టు కొట్టేసి వెంటనే పనిచేయించుకోవడమే మేలన్న ఉద్దేశానికి చాలామంది వచ్చేయడంతో ఎంతగా కంట్రోల్ చేయాలని చూసినా, ఎన్ని ఆంక్షలు విధించినా రెవెన్యూశాఖ ఉద్యోగుల చేతివాటాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bribery-24-16951.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.